ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ఆ బ్యాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇందులో మొత్తం 250 ఖాళీలు ఉండగా, ఎస్సీ వర్గానికి 38, ఎస్టీకి 20, ఓబీసీకి 69, జనరల్ కేటగిరీ కింద 123 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు 20 వేల రూపాయలను వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హతగా 60 శాతం (ఎస్సీ/ఎస్టీలు 55 శాతం) మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ/మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే, సెప్టెంబరు 22వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు) మించి ఉండరాదు.
పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబరు ఏడో తేదీ 2010 నాటికి పంపాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కోసం డిసెంబరు ఐదో తేదీన రాత పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా కూడా పంపొచ్చు.