Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూఐఐసీఎల్‌లో 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు

Advertiesment
యూఐఐసీఎల్
యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 300 ఖాళీలు ఉండగా, ఓపెన్ కేటగిరీ కింద 155, ఎస్సీ 44, ఎస్టీ 20, ఓబీసీ 81 చొప్పున కేటాయిచారు. గ్రూప్-ఏ ఉద్యోగాలకు ఎంకాం, గ్రూప్-బి ఉద్యోగాలకు ఎల్‌ఎల్‌బీతో మూడేళ్ల అనుభవం కలిగివుండాలి.

గ్రూప్-సీ ఉద్యోగాలకు స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/అగ్రికల్చర్ సైన్స్‌లో పీజీ/గ్రూప్-డి ఉద్యోగాలకు అగ్రికల్చర్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ, గ్రూప్-ఈ ఉద్యోగాలకు డిగ్రీలో 60 శాతం మార్కులతో లేదా పీజీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తులు పంపదలచిన అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2010 నాటికి 21 నుంచి 30 ఏళ్లు మించి ఉండరాదు. ఆన్‌లైన్ దరఖాస్తులకు 2011 ఫిబ్రవరి 26వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. రాత పరీక్ష 2011 మార్చి 27వ తేదీన నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu