బ్యాంక్ ఆఫ్ బరోడాలో సుమారు వెయ్యి క్లర్క్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దక్షిణ భారతానికి సంబంధించినంతవరకు ఆంధ్రలో 27, తమిళనాడులో 30, కర్ణాటకలో 17, కేరళలో 18, పాండిచ్చేరిలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంటర్లో లేక తత్సమాన పరీక్షల్లో 60శాతం మార్కులు సాధించి, యాభై శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ జ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 4410-13210 శ్రేణిలో వేతన స్కేలు ఉంటుంది.
తొలి ఆరు నెలలు శిక్షణా కాలం కాగా, ఆ సమయంలో చూపే ప్రతిభ ఆధారంగా వారిని క్రమబద్ధీకరణ చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పిస్తే, అర్హులైన వారిని మాత్రమే రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు రుసుంగా రూ. 200లను బ్యాంక్ ఆఫ్ బరోడా- రిక్రూట్మెంట్ ఆఫ్ క్లరికల్ స్టాఫ్- ప్రాజెక్టు 2008 పేరుతో ముంబయిలో చెల్లుబాటయ్యేలా డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు, ఇతర వివరాలకు ఆ బ్యాంకు వెబ్సైట్ చూడగలరు.