Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహెచ్‌ఈఎల్‌ రాణిపేట్ యూనిట్‌లో 173 ఉద్యోగాలు

Advertiesment
బీహెచ్ఈఎల్
దేశ నవరత్న కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), రాణిపేట్ యూనిట్‌లో వివిధ విభాగాల కింద 173 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 173 పోస్టుల్లో ఫిట్టర్-96, వెల్డర్-40, మెషినిస్ట్-6, ఎలక్ట్రీషియన్-6, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆపరేటర్-20, ఏసీ మెకానిక్-3, సీఎన్‌సీ ఎలక్ట్రానిక్ మెకానిక్-2 చొప్పున ఉన్నాయి.

వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, పదో తరగతి, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్‌తో సహా ఫిట్టర్/వెల్డర్/మెషినిస్ట్/ఎలక్ట్రీషియన్/ఏసీ మెకానిక్/ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌లో నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2010 అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 27 కలిగి ఉండాలి. నవంబరు 15వ తేదీ లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu