నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటిలో 109 పోస్టులను జనరల్ ఆఫీసర్ పోస్టులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ/ఎంఎంఎస్/ఎంసీఏ /సీఏ/ఐసీడబ్ల్యూఏ పూర్తిచేసి ఉండాలి.
అలాగే, స్పెషలిస్ట్ విభాగం కింద మెత్తం 80 పోస్టులను కేటాయించగా, ఆటోమొబైల్ కింద 30 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు ఆటోమోబైల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ లేద పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లీగల్ విభాగంలో 30 పోస్టులు ఉండగా, లా డిగ్రీ విద్యార్హత. మెడికల్ విభాగంలో 20 పోస్టులు ఉండగా, ఎంబీబీఎస్ విద్యార్హత. దరఖాస్తులను డిసెంబరు 17వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది.