నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో సుమారు 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం నాల్కో ప్రకటన విడుదల చేసింది. జూనియర్ ఆపరేటివ్ ట్రైనీస్ (జేఓటి) 240 పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి. వయస్సు 27 ఏళ్లకు మించి ఉండరాదు.
అలాగే, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-3లో మూడు పోస్టులు ఉన్నాయి. కెమిస్ట్రీలో బీఎస్సీ (హానర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 35 ఏళ్లు మించకూడదు. జియాలజీ అసిస్టెంట్ గ్రేడ్-3లో రెండు పోస్టులు ఉండగా, జియాలజీలో బీఎస్సీ (హానర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
పూర్తి చేసిన దరఖాస్తులను పోస్ట్ బాక్స్ నెం: 12005, కోస్సిపోర్ పోస్ట్ ఆఫీస్, కోల్‌కత్తా: 700002 ఈనెల 30వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.nalcoindia.com అనే వెబ్‌సైటులో చూడొచ్చు.