సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో 25వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో దేశవ్యాప్తంగా 9,493 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), 16వేల పోస్టులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోను.. కానిస్టేబుళ్ల (జనరల్ డ్యూటీ) రిక్రూట్మెంట్ కోసం సీఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 1,538 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు.. 246, ఎస్టీలకు.. 108, ఓబీసీలకు.. 415.. జనరల్ కేటగిరీలకు.. 769 పోస్టులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఖాళీలు మొత్తం.. 692 ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు.. 111, ఎస్టీలకు... 48.. ఓబీసీలకు... 187, జనరల్ కేటగిరీలకు.. 346 పోస్టులు ఉన్నాయి.
పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. 2010, ఆగస్టు 1వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్లలోపు వయసు కలవారై ఉండాలి. అయితే ఇందులో ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అభ్యర్థులకు.. 170 సెం.మీ ఎత్తు, 80 సెం.మీ ఛాతీ.. గాల్చి పీల్చినప్పుడు ఇది 85 సెం.మీలు ఉండాలి. ఎస్టీ అభ్యర్థులకు.. ఇతర ప్రాంతాల వారికి శారీరక అర్హతల్లో కొంతమేరకు సడలింపు ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, నవంబర్ 4వ తేదీ. వేతనాలు.. రూ. 5,200 నుంచి 20,200లతో పాటు గ్రేడ్ పే కింద.. అదనంగా.. రూ. 2,000లు ఉంటుంది.
మరిన్ని వివరాలకు.. 'హెచ్‌టీటీపీ://సీఐఎస్ఎఫ్‌డాట్‌నిక్‌డాట్ఇన్'లో చూడండి.