Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాబ్స్: ఒరియెంటల్ బ్యాంక్‌లో 916 క్లర్క్ పోస్టులు

Advertiesment
జాబ్స్
ఒరియెంటెల్ బ్యాంకులో సుమారు 916 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ బ్యాంకు బ్రాంచిలలో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు.. 4, ఎస్టీలకు.. 2, ఓబీసీలకు.. 5, జనరల్ కేటగిరీలకు.. 14 పోస్టులకు కేటాయించారు.

ఇంటర్మీడియట్‌ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా ఏదేని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి. 2009, డిసెంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 28లోపు వయసు కలవారై ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తారు.

ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తును స్వీకరించడం జరుగుతుంది. దరఖాస్తులు పంపవలసిన ఆఖరు తేది.. 2009, నవంబర్ 10. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద.. రూ. 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీ క్యాప్డ్ (పీహెచ్‌సీ)లు రూ. 50లు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఉద్యోగం కోసం అభ్యర్థులకు నిర్వహించే రాత పరీక్ష.. 2009, డిసెంబర్ 27వ తేదీన నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu