Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాబ్స్: ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్- టాక్స్ అసిస్టెంట్లు

Advertiesment
జాబ్స్
టాక్స్ అసిస్టెంట్ల నియామకం కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 904 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సీబీడీటీ విభాగంలో మొత్తం 278 ఖాళీలున్నాయి. ఈ ఖాళీల్లో ఎస్సీలకు.. 39, ఎస్టీలకు... 14, ఓబీసీలకు... 76, జనరల్ కేటగిరీకి.. 149 ఖాళీలను కేటాయించారు.

అలాగే సీబీఈసీ విభాగంలో మొత్తం 626 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీలకు.. 99, ఎస్టీలకు... 66, ఓబీసీలకు... 127, జనరల్ అభ్యర్థులకు... 334 పోస్టులను కేటాయించడం జరిగింది. ఈ రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థలు ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేసిన వారై ఉండాలి.

2009, అక్టోబర్ 30వ తేదీ నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. దరఖాస్తు రుసుము.. రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజులో రాయితీ ఉంటుంది. దరఖాస్తులు స్వీకరించు ఆఖరు తేది.. 2009, అక్టోబర్ 30. పరీక్ష.. 2009, డిసెంబర్ 13వ తేదీన ఉంటుంది.

ఇక హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు కింది చిరునామాకు తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 'హెచ్‌టీటీపీ://ఎస్ఎస్‌సీడాట్‌నిక్‌డాట్ఇన్'లో చూడిండి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా...
రీజినల్ డైరెక్టర్ (ఎస్ఆర్),
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్,
ఈవీకే సంపత్ బిల్డింగ్, సెకెండ్ ఫ్లోర్,
కాలేజ్ రోడ్, చెన్నై- 600 006.

Share this Story:

Follow Webdunia telugu