Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాబ్స్: 313 ప్రొబేషనరీ ఆఫీసర్లు

Advertiesment
జాబ్స్
ఒరియెంటెల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో 313 ప్రొబేషనరీ ఆఫీసర్లు ఖాళీలను భర్తీ చేసేందు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలు తదితర విషయాలను కింద ఇవ్వబడింది.

మొత్తం 313 ఖాళీలు.. ఇందులో ఎస్సీలకు.. 46, ఎస్టీలకు... 23, ఓబీసీలకు.. 84, జనరల్‌కు... 160 ఖాళీలను కేటాయించారు. వేతనం రూ. 10,000 నుంచి 18,240 మధ్య ఉంటుంది. అర్హతలు.. గుర్తింపు పొందిన ఏదేని విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో సైన్స్ డిగ్రీ చేసుండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 55 శాతం మార్కులు సరిపోతుంది.

అలా కాకుండా.. వివిధ విభాగాల్లో డిగ్రీ చేసిన వారం 55 శాతం.. ఎస్టీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం ఉత్తీర్ణత చాలు. 2009, అక్టోబర్ 1వ తేదీ నాటికి వయసు 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారై ఉండాలి. ఇందులో.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు.. పీడబ్ల్యూడీలకు పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

రాత పరీక్ష, మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) తదితరాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది. ఒరియెంటెల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్రాంచ్‌లో అకౌంట్ నెం. 00071131002409 నందు రూ. 400లు దరఖాస్తు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే రూ. 50లు చెల్లిస్తే సరిపోతుంది.

2009, అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 2009, అక్టోబర్ 31వ తేదీ నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. మరిన్ని వివరాలను 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఓబీసీఇండియాడాట్‌కోడాట్ఇన్'లో చూడండి. లేదా.. కింది చిరునామాలో సంప్రదించండి.

ది రీజినల్ హెడ్, ఒరియెంటెల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రీజినల్ ఆఫీస్,
సెకెండ్ ఫ్లోర్, మహర్షి హౌస్,
రోడ్ నెంబర్. 3, బంజారా హిల్స్,
హైదరాబాద్. ఫోన్: 040- 23351233 లేదా 23351236

Share this Story:

Follow Webdunia telugu