Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో ఉద్యోగాలు

Advertiesment
ఉద్యోగాలు
ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులో 1105 క్లరికల్ ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఈ పోస్టుల్లో మన రాష్ట్ర వాటా 25గా ఉంది. ఇందులో జనరల్ కేటగిరీలో 14, ఎస్సీలో 4, ఎస్టీలో 2, ఓబీసీలో ఐదు చొప్పున పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం యాభై శాతం మార్కులతో ఇంటర్ లేదా ఏదేనీ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయస్సు 2010 అక్టోబర్ ఒకటో తేదీనాటికి 18 నుంచి 28 ఏళ్ల (ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయో సడలింపు)కు మించరాదు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి రూ.4410-13210/- చొప్పున వేతనశ్రేణిని చెల్లిస్తారు.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు రూ.50) చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులను నవంబరు 24వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. రాతపరీక్ష వచ్చే యేడాది జనవరి తొమ్మిదో తేదీన నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu