Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐడీబీఐలో 700 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

Advertiesment
ఐడీబీఐ
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన 700 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల్లో జనరల్ కేటగిరీ కింద 353 పోస్టులు కేటాయించగా, ఓబీసీకి 189, ఎస్సీకి 105, ఎస్టీకి 53 చొప్పున పోస్టులు కేటాయించారు.

దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగివుండాలి. అలాగే, అభ్యర్థుల వయస్సు నవంబర్ 30, 2010 నాటికి 25 ఏళ్లుకు మించి ఉండకూడదు. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి తొలి సంవత్సరం నెలకు రూ.12 వేలు, రెండో ఏడాది నుంచి రూ.13,500, మూడో యేడాది రూ.15 వేలు చొప్పున చెల్లిస్తారు.

వచ్చే యేడాది జనవరి 23వ తేదీన నిర్వహించే జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను డిసెంబర్ రెండు, 16వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐడిబిఐ.కామ్‌లో చూడొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu