ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1250 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు 1250 కాగా, వీటిలో జనరల్ కేటగిరీలో 583, ఓబీసీలో 311, ఎస్సీ 172, ఎస్టీ 184 చొప్పున కేటాయించారు. కనీస వేతనం రూ.పది వేలుకాగా, గరిష్టంగా 18240 రూపాయలను చెల్లిస్తారు.
ఆర్ట్స్ అభ్యర్థులు 60 శాతం మార్కులతోనూ, ఇతర అభ్యర్థులు 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీఎస్సీ అభ్యర్థులు మాత్రం 55 శాతం ఉంటే చాలు. 2009 జనవరి ఒకటో తేదీకి 30 ఏళ్ళ మధ్యలోపు ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 16వ తేదీలోగా పంపాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ ఐదో తేదీన దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో జరుగుతుంది.