Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగాలు: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ ట్రైనీలు

Advertiesment
ఉద్యోగాలు
సుమారు 329 జూనియర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేసేందు కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు.. ఆయా సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమాలో జనరల్ చేసి ఉండాలి. ఈ కోర్సుల్లో ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ బ్రాంచ్‌కు స్త్రీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మెకానికల్ బ్రాంచ్... ఐటీఐలో ఫిట్టర్, మ్యాషినిస్ట్, మిల్‌లైట్, ట్యూమర్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్ లేదా ఇంజినీరింగ్ మెకానికల్‌లో డిప్లొమా చేసి ఉండాలి.

ఎలక్ట్రికల్ బ్రాంచ్... ఐటీఐ ఎలక్ట్రీషియన్ లేదా ఇంజినీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేసి ఉండాలి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్... ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.

సివిల్ బ్రాంచ్... ఐటీఐలో సర్వేయర్ లేదా ఆర్కిటెక్చరల్ లేదా డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొంది ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. 18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. అంటే.. 1984, సెప్టెంబర్ 1 నుంచి 1991, సెప్టెంబర్ 1వ తేదీ మధ్యన జన్మించిన వారై ఉండాలి. ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయోపరిమితి, పీడబ్ల్యూలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఈ ఉద్యోగాలుకు ఎంపికై అభ్యర్థులకు 18 నెలలపాటు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఈ కాలంలో ఓ ఏడాది వరకు నెలకు ఉపకార వేతనం కింద రూ. 3,150 చొప్పున చెల్లిస్తారు. మిగిలిన నెలలకు రూ. 3,225 వరకు చెల్లిస్తారు. అనంతరం టెక్నీషియన్ ఎస్- 3 గ్రేడ్‌కు బేసిక్‌గా రూ. 4,170తో పాటు +డిఏ, హెచ్ఆర్ఏలను చెల్లించడం జరుగుతుంది.

మరిన్ని వివరాలు.. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌వైజాగ్‌స్టీల్‌డాట్‌కామ్' చూడండి. ఇదే ఆన్‌లైన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి దరఖాస్తులు లభ్యమవుతున్నాయి. 2009 అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ అవుట్‌కు తప్పనిసరిగా ఫోటోలు జతచేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు కింద జనరల్ లేదా ఓబీసీలకు చెందిన అభ్యర్థులు రూ. 300 ఎస్‌బీఐ అకౌంటులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

అన్ని దరఖాస్తులు స్వీకరించు ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 22
దరఖాస్తులు పంపవలసిన చిరునామా..
అప్లికేషన్ కలెక్షన్ సెంటర్,
మొదటి అంతస్థు, సీ- 217,
సెక్టార్- 63,
నొయిడా- 201 307, ఉత్తరప్రదేశ్.

Share this Story:

Follow Webdunia telugu