Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈఎస్‌ఐ ఆస్పత్రిలో నర్సు ఉద్యోగాలకు ఆహ్వానం

Advertiesment
ఈఎస్ఐ ఆస్పత్రిలో నర్సు ఉద్యోగాలకు ఆహ్వానం
అహ్మదాబాద్, బాపు నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐ మోడెల్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 166 పోస్టులు భర్తీ చేయనుండగా, వాటిలో 84 పోస్టులను జనరల్ క్యాటగరీకి, 45 పోస్టులను ఓబీసీ క్యాటగరీకి, 12 పోస్టులను ఎస్సీ క్యాటగరీకి, 25 పోస్టులను ఎస్టీ క్యాటగరీకి కేటాయించారు.

పదో తరగతి ఉత్తీర్ణులై, నర్సు, మిడ్‌వైఫ్ అర్హతతో దానిని తగిన రీతిలో రిజిష్టర్ చేసి ఉండాలి. గ్రూప్ సీ ఉద్యోగంగా పరిగణించే దీనికి వయోపరిమిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తుదారులు రూ. 200లను ఫీజుగా ఈఎస్‌ఐసీ ఫండ్ అకౌంట్ నెం:1 పేరుతో అహ్మదాబాద్‌లో చెల్లుబాటు అయ్యేలా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్చించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజుల నుంచి మినహాయింపు ఉంటుంది.

రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబరు 30 లోపు ఈఎస్‌ఐసీ మోడెల్ హాస్పిటల్ బిల్డింగ్, బాపు నగర్, అహ్మదాబాద్‌కు పంపాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu