Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగ అవకాశాలు

Advertiesment
దేశం బ్యాంకులు ఆంధ్రా బ్యాంకులు పోస్టులు భర్తీ దరఖాస్తులు
దేశంలోని బ్యాంకుల్లో ఒకటైన ఆంధ్రా బ్యాంకులో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 295 ప్రొబేషనరీ ఆఫీసర్స్‌తో సహా, టెక్నికల్ ఆఫీసర్స్ (15), సెక్యూరిటీ ఆఫీసర్స్ (11), ఛార్టెడ్ అకౌంటెంట్స్ (12), మార్కెటింగ్ అసోసియేట్స్ (100), క్లర్క్స్ (550) తదితర విభాగాల్లో పోస్టులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల్లో 4410 కనీసం వేతనం కాగా, గరిష్టంగా 19920 రూపాయలు చొప్పున చెల్లిస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయగోరు వారు ఆంధ్రా బ్యాంకు రిక్రూట్‌మెంట్ ప్రాజెక్టు-2009 పేరిట ప్రొబేషనరీ అండ్ స్పెషలిస్టు ఆఫీసర్స్ పోస్టులకు రూ.400 విలువ చేసే డీడీని తీసి జతచేసి పంపాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులైతే రూ.75 విలువ చేసే డీడీని జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు మే 12వ తేదీ లోగా పంపాల్సి వుంటుంది. పూర్తి వివరాల కోసం ఆంధ్రాబ్యాంకు వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu