జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - XLRI అనేది ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ. ఈ సంస్థకు సంబంధించి 2023-25 PGDM (BM), PGDM (HRM) బ్యాచ్‌లకు పైనల్ ప్లేస్మెంట్లను విజయవంతంగా ముగించింది. ఇది భారతదేశంలోని ప్రధాన B-స్కూళ్లలో ఒకటిగా తన వారసత్వాన్ని ఇప్పుడు మరోసారి నిరూపించుకున్నట్లు అయ్యింది. XLRI జంషెడ్‌పూర్, XLRI ఢిల్లీ NCR క్యాంపస్‌ల నుండి మొత్తం 591 మంది విద్యార్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. 172 మంది రిక్రూటర్లు, రెండు అంతర్జాతీయ ఆఫర్‌లు, 41 మంది కొత్త రిక్రూటర్‌లతో సహా 600కి పైగా ఆఫర్‌లను సాధించుకున్నారు.
మార్కెట్లో పరిస్థితుల్లో చాలా సవాళ్లతో కూడుకున్నప్పటికీ... యావరేజ్ శాలరీ ₹29 LPAకి చేరుకుంది. టాప్ 10% మంది సగటున ₹52.03 LPA మరియు టాప్ 25% మంది ₹44.35 LPA ప్యాకేజ్ పొందారు. ఇక అత్యధికంగా అంతర్జాతీయ ఆఫర్ ₹1.10 కోట్లుగా ఉండగా, అత్యధిక దేశీయ ప్యాకేజీ ₹75 LPAకి చేరింది.
XLRI టాలెంట్‌ను నమ్ముతున్న ఇండస్ట్రీ లీడర్స్
ఈ సీజన్‌లో 34.17% మంది విద్యార్థులు ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను (PPOలు) అందుకున్నారు, ఇది ఇంటర్న్‌షిప్‌ల సమయంలో వారి అద్భుతమైన పనితీరుకు నిదర్శనం. యాక్సెంచర్ స్ట్రాటజీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG), EY పార్థినాన్, PwC ఇండియా, రిలయన్స్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రముఖ సంస్థలు అత్యధిక సంఖ్యలో ఆఫర్‌లను అందించడంతో కన్సల్టింగ్, BFSI, సేల్స్ & మార్కెటింగ్ అగ్ర నియామక డొమైన్‌లుగా ఉద్భవించాయి.
సెక్టార్ వైజ్ ప్లేస్ మెంట్ వివరాలు
కన్సల్టింగ్: ఈ బ్యాచ్‌లో 26% మంది మెకిన్సే, BCG, బెయిన్ & కో., యాక్సెంచర్ స్ట్రాటజీ, EY పార్థినాన్, కియర్నీ, PwC, IPAC, ఇన్ఫోసిస్, Aon, KPMG మరియు ఇతర అగ్రశ్రేణి సంస్థలలో పాత్రలు పొందారు.
BFSI: గోల్డ్ మన్ సాచ్స్, సిటీ, యాక్సిస్ బ్యాంక్, HDFC ఎర్గో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బార్క్లేస్, డ్యూష్, నాట్‌వెస్ట్, NPCI, స్టాండర్డ్ చార్టర్డ్, HSBC, మాస్టర్ కార్డ్, పాలసీ బజార్, ఇతర సంస్థలలో 22% మంది విద్యార్థులు ప్లేస్మెంట్ పొందారు.
సేల్స్ & మార్కెటింగ్: 18% మంది విద్యార్థులు అబిన్‌బెవ్, అదానీ విల్మార్, అముల్, డాబర్, గోద్రేజ్, HUL, ITC, నెస్లే, P&G, ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్, శామ్‌సంగ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఆసియన్ పెయింట్స్, మోండెలెజ్, నెస్లే, క్రాఫ్ట్ హీంజ్, లోరియల్‌లలో బ్రాండ్ మేనేజ్‌మెంట్ మరియు మార్కెటింగ్ లో ఉద్యోగాలు సాధించారు.
ITES, E-కామర్స్ & టెక్: అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫెడెక్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, నోబ్రోకర్, మీషో, ఓలా, జొమాటో, వివో, UKG, డార్విన్‌బాక్స్, జెన్ ప్యాక్ట్, డబుల్‌టిక్ మరియు అనేక ఇతర కంపెనీలు ఉత్పత్తి నిర్వహణ, అనలిటిక్స్, డిజిటల్ స్ట్రాటజీలో ప్లేస్ మెంట్ పొందారు.
జనరల్ మేనేజ్‌మెంట్ & PSU: పరిశ్రమ దిగ్గజాలు ఆదిత్య బిర్లా గ్రూప్(ABG), క్యాప్‌జెమిని, రిలయన్స్, TAS, మహీంద్రా, వేదాంత, JSW, L&T, BPCL, CPCL, GAIL, IOCL, IREDA, ONGC SPM పోర్ట్, ఇతర PSU & సంస్థలు వ్యూహాత్మక నాయకత్వ ఉద్యోగాల కోసం నియమించబడ్డాయి.
HR పాత్రలు: అమెజాన్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, కోల్గేట్ పామోలివ్, ఫెడెక్స్, ఫ్లిప్‌కార్ట్, HDFC ఎర్గో, ఓలా, రిలయన్స్, ABG, యాక్సెంచర్ TAP, ఎయిర్‌టెల్, HUL, ITC, సన్ ఫార్మా, టాటా స్టీల్, టాటా ఎలక్ట్రానిక్స్, వేదాంత మొదలైన ప్రధాన సంస్థలు HR కన్సల్టింగ్, కాంపెన్సేషన్ & బెనిఫిట్స్, HR అనలిటిక్స్ మరియు చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోల్స్‌లో నియామకాలు చేపట్టడంతో XLRI HR నియామకాలకు అగ్ర ఎంపికగా తన స్థానాన్ని నిలుపుకుంది.
వారసత్వాన్ని కొనసాగిస్తున్న XLRI
ఈ సందర్భంగా XLRI డైరెక్టర్ డాక్టర్ (Fr.) S. జార్జ్, S.J., విద్యార్థుల విజయాల పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, XLRI విద్యార్థులు మరోసారి నాయకత్వం వహించే, స్వీకరించే సామర్థ్యాన్ని ప్రదర్శించారు. రిక్రూటర్ల నుండి వచ్చిన అఖండ స్పందన మా విద్యార్థుల సామర్థ్యం, విలువలు, నాయకత్వ సామర్థ్యంపై పరిశ్రమ యొక్క నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.” అని అన్నారు ఆయన. XLRI గ్రాడ్యుయేట్లకు నిరంతరం పెరుగుతున్న డిమాండ్‌తో, సంస్థ మేనేజ్‌మెంట్ విద్యలో ప్రమాణాలను నిర్దేశిస్తూ, అగ్రశ్రేణి B-స్కూల్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటూనే ఉంది.