Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ నోటిఫికేషన్ జారీ

afcat notification
, సోమవారం, 23 మే 2022 (13:03 IST)
భారత వైమానికదళంలో పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (IAF-AFCAT2022) 2022 నోటిఫికేషన్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లోని కమీషన్డ్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. జూలై 2023 ప్రారంభమయ్యే ఎన్సీపీ స్పెషల్ ఎంట్రీ, మెటియోరాలజీ ఎంట్రికీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 
 
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతన భత్యాలు తదితర వివరాలను వివరిస్తూ ఓ ప్రకటన చేసింది. పే స్కేలు నెలకు 56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంటుంది. ఫ్లైయింగ్ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 2023 నాటికి 20 నుంచి 24 యేళ్ల లోపువారై ఉండాలి. మిగిలిన పోస్టులకు 28 యేళ్లలోపు అంటే జూలై 2 1997 నుంచి జూలై 1 2023ల మధ్య జన్మించి ఉండాలి. 
 
ఈ పోస్టులకు అవివాహిత యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, శరీరంపై ఏ భాగంలోనైనా టాటూలు ఉంటే మాత్రం దరఖాస్తుకు అనర్హులు. ఈ పోస్టులను రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఏఎఫ్‌క్యాట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ జూన్ 1, 2022. ముగింపు తేదీ జూన్ 30, 2022. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి పట్టివేత