న్యూఢిల్లీలో జరిగే 2010 కామన్వెల్త్ క్రీడల కోసం.. క్రీడా నిర్వహణ, వేదిక నిర్వహణ, స్పోర్ట్స్, టెక్నాలజీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదలైంది. క్రింది పేర్కొన్న ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తులను పంపుకోవచ్చు.
డైరెక్టర్ వర్క్ ఫోర్స్ ఆపరేషన్, డీడీజీ వర్క్ ఫోర్స్, గేమ్స్ విలేజ్, పీఓ టైం రిజల్ట్ స్కోరింగ్, భద్రత, ఇమేజ్ అండ్ లుక్స్, క్లీనింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్, అకామ్డేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ప్లానింగ్), క్యాటరింగ్ (ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్), సీజీఏ రిలేషన్స్ (ప్రాజెక్ట్ ఆఫీసర్ హాస్టల్స్, స్పెక్టేటర్ సర్వీసెస్ ప్రాజెక్ట్ అధికారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ వాలంటీర్లు, పీవో ట్రాన్స్పోర్ట్, డైరెక్టర్ టికెటింగ్తో పాటు ఇంకా మరిన్ని ఉద్యోగాలున్నాయి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత ఉద్యోగార్హతను పేర్కొంటూ.. పూర్తి వివరాలు గల దరఖాస్తులను 'కెరీర్స్అట్సీడబ్ల్యూజీఢిల్లీ2010'కు పంపండి.