హిందుస్థాన్ లేటెక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్ఎల్) సంస్థలో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏదేని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్)లో ఉత్తీర్ణులై, మార్కెటింగ్‌లో ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అలాగే, బిజినెస్ మేనేజర్ పోస్టులకు కూడా గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి ఎంబీఏ (మార్కెటింగ్)లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అయితే, ఎనిమిది సంవత్సరాల అనుభంతో పాటు.. 45 సంవత్సరాల వయస్సును మించి ఉంచకూడదు. ప్రాడక్ట్ మేనేజర్ పోస్టులకు కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తుతో సహా సర్టిఫికేట్‌ను పంపాల్సి వుంటుంది. జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), హెచ్ఎల్ఎల్, రిజిస్టర్డ్ అండ్ కార్పొరేట్ ఆఫీసు, పూజాప్పుర, తిరువనంతపురం, కేరళ అనే చిరునామాకు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.