సైన్స్, మ్యాథ్స్‌కు తప్ప ఉద్యోగాలు వచ్చే కాలాలు ఎప్పుడో పోయాయని అనుకునే రోజులకు కాలం చెల్లింది. సి.ఎ. చేసిన వారికి ఉన్నంత ఉజ్వల భవిష్యత్తు మరెవ్వరికీ లేదనే చెప్పాలి. అవసరం లక్షల్లో ఉంటే అర్హులు వేలల్లో ఉన్నారు. వైట్ కాలర్ జాబ్‌గా గుర్తింపు పొందిన చార్టెర్డ్ అకౌంటు ఉద్యోగం ప్రతి సంస్థకు అవసరం ఉంది.
భారతదేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామీకరణ పెరిగిపోతోంది. దీనితోడు విదేశీ కంపెనీలు దేశంలోకి ప్రవాహంలా వచ్చిపడుతున్నాయి. ఇలాంటి పిరిస్థితులలో వీరికి మంచి గిరాకీ ఉంది. నైపుణ్యత కలిగి చార్టెర్డ్ అకౌంటెంట్ల కోసం కార్పొరేట్ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి.
ఎటువంటి ఉద్యోగాలుంటాయి
చాలా రకాల ఉద్యోగాలే ఉన్నాయి. వాటి ప్రముఖమైనవి అకౌంటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, ప్రాజెక్టు ఎవాల్యూషన్, కంపెనీ లా, టాక్సేషన్, కార్పొరేట్ గవర్నన్స్ విభాగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన అన్ని ఉద్యోగాలకు వీరు అర్హులే.
చార్టెర్డ్ అకౌటెంట్ కావాలంటే...
సిఎ చేయాల్సి ఉంటుంది. ఇందులో మూడు దశలుంటాయి. సాధారణంగా పదవ తరగతి పూర్తి చేసిన వారు కూడా చార్టెర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ప్రవేశించవచ్చు. ఈ సర్టిఫికెట్తో ఐసిఏఐ నిర్వహించే కామన్ ప్రొపిషియెన్సీ టెస్ట్‌కు పేరు నమోదు చేసుకుంటే చాలు. ఇందులో మొదటి దశ ఇదే. తరువాత పీసీసీ రెండవ దశ అవుతుంది.
మూడవ దశ ఫైనల్ ఇవి పాసైతే సిఎ సాధించినట్లే. ఇది కాకుండా ఇంటర్మీడియటు పూర్త చేసుకున్న వారు సిపిటి పరీక్ష రాసి నేరుగా పీసీసీలో పేరు నమోదు చేసుకోవచ్చు. సిపిటి పరీక్ష ప్రతి యేడు జూన్, డిసెంబరులలో జరుగుతుంది. 15 నెలలు ఆర్టికల్ శిక్షణ పూర్తయ్యాక మూడు నెలలకు పీసీసీ పరీక్ష రాయవచ్చు.
అక్కడ పాసైతే మూడన్నరయేళ్ళపాటు ఆర్టికల్ శిక్షణ తీసుకోవాలి. శిక్షణ పూర్తయ్యాక ఫైనల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. వేతనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలు ఉంటే, వేల సంఖ్యలో మాత్రమే అభ్యర్థులున్నారు.
వేతనాలేలా ఉంటాయి..
ఇది చార్టర్డ్ అకౌంటెంట్ సత్తాను అనుసరించి లక్షల్లోనే ఉంటుంది. పోయిన యేడును పరిగణలోకి తీసుకుంటే 737 మందికి రూ. 5 నుంచి 7.5 లక్షలు వేతనం కాగా, 363 మందికి రూ. 3.5 నుంచి 5 లక్షల వరకూ ఉంది. ఇదీ కాదంటే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు ఇందుకు తిరుగు ఉండదు.