Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెయ్యి క్లర్క్ పోస్టులు

Advertiesment
కెరీర్ అవకాశాలు బ్యాంక్ ఆఫ్ బరోడా వెయ్యి క్లర్స్ పోస్టులు భర్తీ దక్షిణ భారతం ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ పాండిచ్చేరి
, మంగళవారం, 9 సెప్టెంబరు 2008 (17:30 IST)
బ్యాంక్ ఆఫ్ బరోడాలో సుమారు వెయ్యి క్లర్క్ పోస్టులు భర్తీ చేయనున్నారు. దక్షిణ భారతానికి సంబంధించినంతవరకు ఆంధ్రలో 27, తమిళనాడులో 30, కర్ణాటకలో 17, కేరళలో 18, పాండిచ్చేరిలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇంటర్‌‌లో లేక తత్సమాన పరీక్షల్లో 60శాతం మార్కులు సాధించి, యాభై శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ జ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 4410-13210 శ్రేణిలో వేతన స్కేలు ఉంటుంది.

తొలి ఆరు నెలలు శిక్షణా కాలం కాగా, ఆ సమయంలో చూపే ప్రతిభ ఆధారంగా వారిని క్రమబద్ధీకరణ చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పిస్తే, అర్హులైన వారిని మాత్రమే రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.

దరఖాస్తు రుసుంగా రూ. 200లను బ్యాంక్ ఆఫ్ బరోడా- రిక్రూట్‌మెంట్ ఆఫ్ క్లరికల్ స్టాఫ్- ప్రాజెక్టు 2008 పేరుతో ముంబయిలో చెల్లుబాటయ్యేలా డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు, ఇతర వివరాలకు ఆ బ్యాంకు వెబ్‌సైట్ చూడగలరు.

Share this Story:

Follow Webdunia telugu