347 ఉద్యోగాల భర్తీకి.. భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), భోపాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో గల ఈ ఉద్యోగాలకు గల అర్హతలు.. వంటి తదితర విషయాలను క్రింద పేర్కొనడం జరిగింది.
ఎలక్ట్రీషియన్.. మొత్తం 100 ఖాళీలున్నాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్‌టీసీ)తో పాటు.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (ఎన్ఏసీ)ని పొంది ఉండాలి.
ఫిట్టర్‌లో.. మొత్తం 162 ఖాళీలున్నాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్‌టీసీ)తో పాటు.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (ఎన్ఏసీ)ని పొంది ఉండాలి.
మెకానిక్‌లో.. మొత్తం 55 ఖాళీలున్నాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్‌టీసీ)తో పాటు.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ (ఎన్ఏసీ)ని పొంది ఉండాలి.
వెల్డర్.. మొత్తం 30 ఖాళీలున్నాయి. 60 శాతం మార్కులతో ఐటీఐ లేదా ఎన్‌టీసీతో పాటు ఎన్ఏసీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే.. 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు.
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు.. 2009, సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల వయసు లోపు వారై ఉండాలి. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. మరిన్ని వివరాలకు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌బీహెచ్ఈఎల్‌బీపీఎల్‌డాట్‌కోడాట్ఇన్'లో చూడండి.
దరఖాస్తులు పంపవలసిన ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 24.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
పోస్ట్ బాక్స్ నెం. 35,
పోస్టాఫీసు- పిప్లాని, బీహెచ్ఈఎల్,
భోపాల్- 462022.