ఢిల్లీ పోలీసు శాఖలో 6,718 కానిస్టెబుల్ ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింద ఇవ్వబడింది.
ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్.. మొత్తం 6,302 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీలకు.. 945, ఎస్టీలకు.. 473, ఓబీసీలకు.. 1,702, జనరల్ కేటగిరీలకు.. 3,182 ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి. పురుషుల మాత్రమే అర్హులు. 2009, జూలై 1వ తేదీ నాటికి.. 21 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎత్తు.. 170 సెం.మీ, ఛాతీ.. 81 సెం.మీ (పీల్చినపుడు 85 సెం.మీ)ల మేరకు శారీరక అర్హతలు ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్.. మహిళలకు మాత్రమే. మొత్తం 416 ఖాళీలున్నాయి. ఎస్సీలకు.. 62, ఎస్టీలకు.. 31, ఓబీసీలకు.. 112, జనరల్ కేటగిరీలకు.. 211 సీట్లున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి. 2009, జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎత్తు.. సెం.మీ.ల మేరకు శారీరక అర్హతలు ఉండాలి.
ఈ రెండు రకాల పోస్టులకు వేతన శ్రేణి.. రూ. 5,200 నుంచి 20,200లతో పాటు.. గ్రేడ్ పే కింద.. రూ. 2వేల వరకు ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తు రుసుము కింద.. 'డీసీపీ/రిక్రూట్మెంట్ సెల్, న్యూ పోలీస్ లైన్, ఢిల్లీ' పేరిట రూ. 100 డీడీని తీయాలి. దీన్ని దరఖాస్తుకు జతచేసి పంపాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
2009, నవంబర్ 7వ తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు లేదా దాని నమూనా పొందవచ్చు. మరిన్ని వివరాలకు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఢిల్లీపోలీస్డాట్నిక్డాట్ఇన్'లో చూడండి.
దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, నవంబర్ 11.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
పోస్ట్ బాక్స్ నెంబర్. 8020,
ఢిల్లీ- 110 033.