Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాబ్స్: పశస్త్ర సీమబల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

Advertiesment
జాబ్స్
పశస్త్ర సీమబల్‌ (ఎస్ఎస్‌బీ)లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. దీనికి సంబంధించి అర్హతలు, ఖాళీలు తదితర వివరాలను కింద చూడవచ్చు.

ఆంధ్రప్రదేశ్.. మొత్తం 237 ఖాళీలున్నాయి. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు.. మొత్తం 125 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీలకు.. 20, ఎస్టీలకు.. 9, ఓబీసీలకు.. 34, జనరల్ కేటగిరీకి.. 62 సీట్లు చొప్పున కేటాయించారు. అలాగే ఇతర ఖాళీలు.. మొత్తం 112 ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు.. 18, ఎస్టీలకు.. 8, ఓబీసీలకు.. 30, జనరల్ కేటగిరీలకు 56 సీట్ల చొప్పున కేటాయించారు.

పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వేతన.. రూ. 5,200 నుంచి రూ. 20,200 వరకు ఉంటుంది. దీంతో పాటు గ్రేడ్ పే రూ. 2వేల వరకు అదనంగా లభిస్తుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 2009, ఆగస్ట్ 1వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తుదారులు.. 170 సెం.మీ ఎత్తు, 80 సెం.మీల ఛాతీ (గాలి పీల్చినపుడు 85 సెం.మీ) మేరకు ఉండాలి. దృష్టి లోపం ఉండరాదు. (వివిధ ప్రాంతాల వారికి.. ఎస్టీలకు శారీక అర్హతల్లో సడలింపు ఉంటుంది). 'The Commandant 25th Bn SSB' పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్కే పురం, న్యూఢిల్లీ- 1076 నందు చెల్లే విధంగా రూ. 50 డీడీ దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

పూర్తి చేసిన దరఖాస్తుకు.. అభ్యర్థులు తమ స్వంత చిరునామా గల రెండు కవర్లను జతచేయాలి. దరఖాస్తు కవరుపై 'అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ (జీడీ)' అని రాసి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 26. మరిన్ని వివరాలకు 'హెచ్‌టీటీపీ://ఎస్ఎస్‌బీడాట్‌నిక్‌డాట్ఇన్' వెబ్‌సైట్ చిరునామాలో చూడండి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
The Commandant,
25th Bn (SSB) Ghitorni, PO:
Arjungarh, New Delhi- 110 047.

Share this Story:

Follow Webdunia telugu