ఐడీబీఐ బ్యాంకులో సుమారు 1,520 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
ఎగ్జిక్యూటివ్‌లు.. మొత్తం 300 ఖాళీలున్నాయి. ఏదైని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ కలిగిన వారు అర్హులు. 25 ఏళ్ల వయసులోపు వారు ఇందుకు అర్హులు.
అసిస్టెంట్ మేనేజర్- గ్రేడ్ ఏ.. మొత్తం 850 ఖాళీలున్నాయి. డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులను కలిగి ఉండాలి. 28 ఏళ్ల వయసులోపు వారై ఉండాలి.
మేనేజర్- గ్రేడ్ బీ... మొత్తం 370 ఖాళీలున్నాయి. డిగ్రీతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ మ్యూచ్యువల్ ఫండ్స్ లేదా కమర్షియల్ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థల్లో కనీసం మూడేళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. 32 ఏళ్లలోపు వయసుకలిగిన వారై ఉండాలి.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- గ్రేడ్ సీ... మొత్తం 400 ఖాళీలున్నాయి. డిగ్రీ చేసి... దానితో పాటు సీఏ, ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏలు చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దీంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ మ్యూచ్యువల్ ఫండ్స్ లేదా కమర్షియల్ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థల్లో కనీసం ఐదేళ్లు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. 37 ఏళ్లలోపు వయసు కలిగిన వారై ఉండాలి.
2009, అక్టోబర్ 20వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా సంబంధిత దరఖాస్తులను పంపుకోవచ్చు. మరిన్ని వివరాలకు.. 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఐడీబీఐడాట్కామ్'లో చూడండి.