హైదరాబాదుకు చెందిన "ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్" సంస్థ బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆసక్తిగల అభ్యర్థులు "ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, రోడ్ నెం.14, బంజారాహిల్స్, హైదరాబాద్ 500 034" అడ్రస్సులోగానీ, 040-23551235 ఫోన్ నెంబర్లోగానీ సంప్రదించవచ్చు.
కాగా, కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి...
బీఎస్సీ నర్సింగ్ : దీనికాగనూ విద్యార్హతలు ఇంటర్మీడియట్లో బైపీసీ చదివి ఉండాలి. కోర్సు కాలపరిమితి నాలుగేళ్లు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా : విద్యార్హతలు ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, కోర్సు కాలపరిమితి మూడున్నరేళ్లు.
లేబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా : ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి చదివి ఉండాలి. కోర్సు కాలపరిమితి రెండేళ్లు. ఎనిస్థీయాలజీలో సర్టిఫికెట్ కోర్సు : సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కాలపరిమితి ఒక సంవత్సరం.
బ్లడ్ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్ కోర్సు : సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కాలపరిమితి ఒక సంవత్సరం. రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్‌లో సర్టిఫికెట్ కోర్సు : సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. కాలపరిమితి ఒక సంవత్సరం.