Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశాలు

Advertiesment
ఇండియన్ ఎయిర్ఫోర్స్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్-ఎక్స్ (టెక్నికల్), గ్రూప్-వై(ఆటో టెక్నీషియన్, గ్రౌండ్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (పోలీస్) ట్రేడ్‌లకు రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన జిల్లాల నుంచి అవివాహిత పురుషులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రూప్-ఎక్స్ (టెక్నికల్) పోస్టుకు కనీసం యాభై శాతం మార్కులతో మ్యాథమ్యాటిక్స్, ఫిజిక్స్‌లతో ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, మెకానిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొ బైల్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా ఐటీలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా కలిగివుండాలి.

గ్రూప్-వై‌లో ఇంటర్మీడియెట్ లేదా 10+2 లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1, 1990 నుంచి సెప్టెంబర్ 30, 1994 మధ్య జన్మించి ఉండాలి. రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించే తేదీలు: ఏప్రిల్ 13, 2011 నుంచి ఏప్రిల్ 18, 2011 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు దిండిగల్, హైదరాబాద్‌లలోని ఎయిర్ ఫోర్స్ అకాడెమీలలో శిక్షణ ఇస్తారు.

Share this Story:

Follow Webdunia telugu