ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను సోమవారం విశ్వవిద్యాలయ ఉపకులపతి బీల సత్యనారాయణ ప్రారంభించారు. బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకోసం ఈ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు.
కౌన్సెలింగ్ ప్రారంభమైందనడానికి సూచికగా ఫిజికల్ సైన్సు విభాగంలో క్యాంపస్ ఆన్‌లైన్ కేంద్రం ద్వారా ప్రవేశాలు పొందిన నిర్మలకుమారి, షేక్ రజియా, స్నేహలతలకు ఆయన ప్రవేశ పత్రాలు అందించారు.