యనిసిస్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన క్లౌడ్ 20/20 వెర్షన్ 6.0 పోటీ విజేతల పేర్లను వెల్లడించింది. ఈ పోటీలో పుదుచ్చేరికి చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఇది క్లౌడ్ 20/20 వెర్షన్ 6.0 అత్యంత అధునాతనమైన ఆన్‌లైన్ టెక్నికల్ ప్రాజెక్టు పోటీలు కావడం గమనార్హం. వివిధ రౌండ్ల పోటీ పరీక్షల అనంతరం వి షేర్ విభాగానికి గాను రెండో బహుమతిని పుదుచ్చేరి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఒ.నిషా, పి.పార్వతి, జి.సుజాతలు కలిసి కైవసం చేసుకున్నారు. వీరికి రెండో బహుమతికి రూ.75 వేల బహుమతిని ప్రదానం చేశారు. ఈ పోటీల్లో దాదాపు 1400 మంది విద్యార్థులు పాల్గొనగా మొత్తం 530 ప్రాజెక్టులు వచ్చాయి.
వి షేర్ ప్రాజెక్టులో మొబైల్ డివైస్‌లలో విద్యుత్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించి వీడియోలను డౌన్‌లోడింగ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం ఎలా అనే అంశంపై ఈ పోటీ సాగింది. ఇదే అంశంపై యునిసిస్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ కుమార్ ప్రభుదాస్ మాట్లాడుతూ... మనిషి జీవినశైలి, పనితీరును అధునాతన టెక్నాలజీ శరవేగంగా మార్చివేస్తోందన్నారు. అలాగే, అనేక సవాళ్లు కూడా ఉన్నాయన్నారు. ఈ సవాళ్లను అధికమిస్తూ ప్రగతి పథంలో సాగాల్సి ఉందన్నారు.