Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూజీసీ అదుర్స్.. ఆడపిల్లలకు స్పెషల్ స్కాలర్‌షిప్.. ఎలా అప్లై చేయాలి?

Advertiesment
UGC Scholarship
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:25 IST)
బాలికల అక్షరాస్యతను పెంచేందుకు, వారి ఉన్నత విద్యకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా భాగమైంది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలకు యూజీసీ స్పెషల్ స్కాలర్ షిప్ అందించనుంది. 
 
దేశంలోని గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సింగిల్ గర్ల్ చైల్డ్‌కు ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. వివిధ ప్రమాణాల ప్రకారం మూడు వేల మందిని ఎంపిక చేసి, వారికి యూజీసీ 'పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరా గాంధీ స్కాలర్ షిప్స్' అందించనుంది. 
 
ఎంపికైన విద్యార్థినులకు సంవత్సరానికి రూ.36,200 చొప్పున స్టైఫండ్ అందిస్తారు. ఇది ఆడపిల్లల ఉన్నత విద్య, సాధికారత కోసం వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు సహాయపడుతుందని యూజీసీ చెబుతోంది.
 
ఈ స్కీమ్ ద్వారా ప్రస్తుతం కేవలం 3000 స్కాలర్ షిప్స్ అందించనున్నారు. ఒక్కొక్కరికీ సంవత్సరానికి రూ.36,200 చొప్పున.. రెండు సంవత్సరాలు మాత్రమే స్టైఫండ్ ఇస్తారు. పీజీ పూర్తయ్యే వరకు ఇది అందుతుందన్నమాట. కోర్సులో చేరిన సమయానికి, ఆ తర్వాత మరుసటి సంవత్సరం ప్రారంభంలో మరోసారి ఈ మొత్తం చెల్లిస్తారు.
 
ఎవరు అప్లై చేయొచ్చంటే..
పీజీ కాలేజీల్లో లేదా యూనివర్సిటీల్లో మొదటి సంవత్సరంలో చేరబోయే వారందరూ ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. రెండో సంవత్సరం వారికి ఇది వర్తించదు. విద్యార్థినుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. అడ్మిషన్ సమయానికి అంతకంటే తక్కువ వయసు ఉంటే సరిపోతుంది.
రెగ్యులర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదవబోయే అమ్మాయిలకు అది కూడా తన తల్లిదండ్రులకు కేవలం ఒక సంతానమైన వారికే ఇది వర్తిస్తుంది. అన్న లేదా తమ్ముడు ఉన్న వారికి కూడా ఇది వర్తించదు. అయితే కవల సోదరి లేదా సోదరుడు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. డిస్టెన్స్ మోడ్‌లో పీజీ చేసే వారు స్కాలర్‌షిప్‌ పొందలేరు.
 
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి ఉన్న వారు నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ (NSP) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత అర్హతలు ఉన్న విద్యార్థినులు మాత్రమే నవంబర్ 30, 2021 లోపు అప్లై చేసుకోవాలి. వారి ఆన్ లైన్ అప్లికేషన్‌ను సంబంధిత విద్యా సంస్థ వెరిఫై చేయాలి. తల్లిదండ్రులకు కేవలం తాను మాత్రమే సంతానమని చెప్పే అఫిడవిట్ దాఖలు చేయాలి.
 
ఒకసారి అప్లై చేసిన తర్వాత మరుసటి సంవత్సరం ఇదే పోర్టల్‌లో రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సెమిస్టర్‌లో ఫెయిల్ అయిన వారికి మరుసటి సంవత్సరంలో స్కాలర్ షిప్ లభించదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒడిశాలో 2100 కిలలో గంజాయి పట్టివేత, 26 మంది అరెస్ట్