Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారంలో 3 రోజులే పనిదినాలు : కార్పొరేట్ కంపెనీల ఆలోచన!

Advertiesment
Three-day Working Week
, ఆదివారం, 3 ఆగస్టు 2014 (16:45 IST)
కాలం శరవేగంగా మారిపోతోంది. కాలంతో పాటు పనిదినాల సంఖ్య, పనిదినాల వేళలు కూడా మారిపోతున్నాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారతీయుల సేవలు ప్రపంచ దేశాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ పేరిట భారత దేశం ప్రతియేటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. దీంతో వారంలో ఆరు రోజులు పని చేసే ఉద్యోగులు ఐదు రోజులు చేస్తే చాలని సాఫ్ట్‌వేర్ కంపెనీలు వీకెండ్ డేస్‌గా శని, ఆదివారాలను సెలవుదినాలుగా ప్రకటించాయి. 
 
ఇది ఫలించి ఐదు రోజులు ఉద్యోగులు నిబద్ధతతో పని చేసి ఉత్పత్తి పెంచడం ప్రముఖ సంస్థలు గ్రహించాయి. దీంతో మూడు రోజుల పనిదినాల ప్రతిపాదనతో ముందుకు వస్తున్నాయి. వ్యాపార దిగ్గజాలు కార్లోస్ సిమ్, రిచర్డ్ బ్రాన్సన్‌లు రోజుకు 11 గంటల చొప్పున వారంలో మూడే రోజులు పని చేస్తే మరింత మెరుగైన ఉత్పాదన సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు. వారి ప్రతిపాదనపై భారతీయ హెచ్‌ఆర్ నిపుణులు పెదవి విరుస్తున్నారు. 
 
భారతీయ పరిస్థితులకు ఆ ప్రతిపాదన ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సర్వీస్, రిటైల్, ఎంటర్‌టైన్మెంట్, హెల్త్ కేర్ రంగాల్లో మూడు పని దినాలంటే కుదిరేపనేనా, గంటల ప్రాతిపదిక పని చేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం ప్రతికూలంగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu