తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2022 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది ఈ ఫలితాలను వెల్లడించిన తర్వాత icet.tsche.acin లో విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబరు నమోదును చేయడం ద్వారా ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చని పేర్కొంది. వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఐసెట్ 2022 పరీక్షను జూలై 27, 28 తేదీన్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహిచిన విషయం తెల్సిందే.
దీనికి సంబంధించిన ఆన్సర్ షీటును ఆగస్టు 4వ తేదీన విడుదల చేసిన విషయం తెల్సిందే. అలాగే, ఈ ఆన్సర్ షీటుపై సందేహాలు లేవనెత్తడానికి అవకాశం కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలను సోమవారం విడుదల చేయనుంది.