Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ సైన్సెస్‌లో మొదటి బీఏని ప్రారంభించిన షివ్ నాడర్ యూనివర్సిటీ, ఢిల్లీ-ఎన్సీఆర్

Advertiesment
Shiv Nadar University

ఐవీఆర్

, గురువారం, 27 నవంబరు 2025 (22:35 IST)
హైదరాబాద్: ఇంటర్ డిసిప్లినరి హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్(IHS)లో భారతదేశంలో మొదటిసారి B.A.(పరిశోధన) కార్యక్రమం ప్రారంభోత్సవం గురించి ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ పురస్కార గ్రహీత షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్సీఆర్ ఈరోజు ప్రకటించింది. పెరుగుతున్న సంక్లిష్టమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి, ఎదుర్కోవడానికి సమర్థవంతులైన నిపుణులను ప్రోత్సహించడానికి రూపొందించబడిన ఒక పరివర్తనా ప్రోగ్రాం ఇది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విద్యావేత్తలు, స్కూల్ నాయకులు, అకాడమీషియన్స్, విధానాల రూపకర్తలు హాజరయ్యారు. ఇది భారతదేశంలో ఉన్నత విద్యా పరిస్థితిలో అంతర విభాగాల అభ్యాసనకు పెరుగుతున్న గుర్తింపును సూచించింది.
 
బహుళ విభాగాల విద్యలో యూనివర్శిటీ వారి శక్తివంతమైన పునాదిపై నిర్మితమైన, కొత్త B.A(పరిశోధన) కార్యక్రమం సస్టైనబిలిటీ స్టడీస్; ఆర్కియాలజీ; హెరిటేజ్ మరియు హిస్టారికల్ స్టడీస్; లేదా సొసైటీ, కల్చర్ అండ్ టెక్నాలజీ వంటి మూడు ప్రత్యేకతల్లో విద్యార్థులు ఒకటి ఎంచుకోవడానికి ముందు నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, జియో-పాలిటిక్స్, బిజినెస్, A.I. ఇతర డొమైన్స్‌లో విస్తరించిన శక్తివంతమైన ప్రాథమిక పాఠ్యాంశాన్ని వారికి ఇస్తుంది. ఏదైనా ఉన్నత పాఠశాల విభాగానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు.
 
అసాధారణమైన ప్రతిభను పొందడానికి వీలు కల్పించడానికి, యూనివర్శిటీ ప్రతి బ్యాక్ కోసం పది పూర్తి ఉపకారవేతనాలను ప్రకటించింది. నాలుగు సంవత్సరాల కోసం 100% ట్యూషన్ ఫీజును ఇది కవర్ చేస్తుంది. ఇదే కాకుండా, పలు యూనివర్శిటీ వారీ ఉపకారవేతనాలు, ఆర్థిక సహాయ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
 
కార్యక్రమానికి ప్రొఫెసర్ రజత్ కథూరియా, డీన్, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌తో పాటు యూనివర్శిటీకి చెందిన ప్రముఖ బోధనా సిబ్బంది నేతృత్వంవహిస్తారు. ఈ ప్రోగ్రాం యొక్క విద్యార్థి జియోపాలిటిక్స్, వాతావరణం మార్పు, AI మరియు టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ మరియు కల్చర్ లో ప్రధానమైన అంతర్జాతీయ పోకడలను అర్థం చేసుకోవడం ద్వారా వేగంగా మారుతున్న ప్రపంచంలో విజయం సాధించడానికి సిద్ధంగా ఉంటాడు. అకాడమియా, ప్రైవేట్ రంగం, ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు మరియు స్టార్టప్స్ వంటి వాటిలో కెరీర్లు కొనసాగించడానికి కావలసిన నైపుణ్యాలను కూడా విద్యార్థులు కలిగి ఉంటారు. లైవ్ ప్రాజెక్టులు, క్షేత్ర పని, క్షేత్ర యాత్రలు, ఎక్స్ ఛేంజ్ లు, పాఠ్యాంశంలో విలీనం చేయబడిన ఇమ్మర్షన్స్ మరియు ఇంటర్న్ షిప్స్ కోసం అవకాశాలతో అనుభవపూర్వకమైన అభ్యాసన మరియు బాధ్యత, AIని నైతికంగా వినియోగించడం వంటి వాటి ద్వారా విద్యార్థులకు మద్దతు లభిస్తుంది.
 
ఈ ప్రోగ్రాం గురించి వ్యాఖ్యానిస్తూ, ప్రొఫెసర్ రజత్ కథూరియా, డీన్, స్కూప్ ఆఫ్ హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ ఇలా అన్నారు, “21వ శతాబ్దంలో హ్యుమానిటీస్ ను అధ్యయనం చేయడం అంటే ఏమిటో  ఈ కొత్త కార్యక్రమం పునర్నిర్వచించింది. ఇది విద్యాపరమైన కాఠిన్యాన్ని లైవ్ ప్రాజెక్టులు, క్షేత్ర పనులు, మరియు ఎక్స్ ఛేంజ్ కార్యక్రమాలు ద్వారా ఆచరణాత్మకమైన సాధనతో కలుపుతుంది. అందువలన విద్యార్థులు కేవలం ప్రపంచం గురించి తెలుసుకోవడమే కాకుండా దానిని మార్చడానికి తగిన విధంగా సంసిద్ధతను కలిగి ఉంటారు. విమర్శనాత్మకంగా ఆలోచించడం, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మరియు నైతికంగా ఆవిష్కరణలు చేయగల గ్రాడ్యుయేట్స్ ను సృష్టించడమే మా లక్ష్యం .”
 
ప్రగతిశీలకమైన పాఠ్యాంశం
నాలుగేళ్ల B.A. (పరిశోధన) IHS ప్రోగ్రాం ఈ కింది వాటిని కలుపుతుంది
 
మొదటి సంవత్సరం ప్రధానమైన పాఠ్యాంశంలో నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, బిజినెస్, ఎథిక్స్, డిజిటల్ హ్యుమానిటీస్, AI, మరియు కమ్యూనికేషన్ ఉంటాయి.
 
ఎంపిక మరియు సరళతలు, విద్యార్థులు మైనర్‌తో B.A. (పరిశోధన), B.A. (ఆనర్స్), or B.A. (పరిశోధన)
 
ఇన్నోవేషన్ హబ్‌లో ముగిసే తప్పనిసరి AI అక్షరాస్యత మాడ్యూల్. దీనిలో విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరి AI అప్లికేషన్స్‌ను రూపొందించగలరు
 
ఇంటర్న్ షిప్స్, లివింగ్-ల్యాబ్ ప్రాజెక్టులుగా క్యాంపస్, అంతర్జాతీయ ఎక్స్ ఛేంజ్ లు, మరియు వేసవి క్షేత్ర పని ద్వారా అనుభవపూర్వకమైన అభ్యాసన
 
పాలసీ, సుస్థిరత, హెరిటేజ్, జర్నలిజం, డిజైన్, మీడియా, సామాజిక పరిశోధన మరియు ఉన్నత విద్యలో కెరీర్స్ లోకి బహుళ మార్గాలు
 
అంతర్జాతీయ సంభాషణలు వాతావరణ సామర్థ్యం, సాంస్కృతిక గుర్తింపు, నైతిక సాంకేతికత, మరియు సామాజిక మార్పు  గురించి చర్చించడం పెరిగిన కారణంగా, సంప్రదాయబద్ధమైన హద్దులకు మించి విద్యార్థులు ఆలోచించగలగడం మరియు కొత్త ఆలోచనలను కార్య రూపంలో పెట్టగల సామర్థ్యానికి ఇంటర్ డిసిప్లినరి హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ ప్రోగ్రాం వారిని సిద్ధంగా ఉంచుతుంది.
 
ఈ ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్. రాజీవ్ కుమార్ సింగ్, అసోసియేట్ డీన్, అకాడమిక్స్, షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్సీఆర్ ఇలా అన్నారు, మేము 2026-27 విద్యా సంవత్సరం కోసం ప్రవేశాలు ప్రారంభించిన కారణంగా, షివ్ నాడర్ యూనివర్శిటీ, ఢిల్లీ-ఎన్సీఆర్  తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో శ్రేష్టత చూపించాలని కోరుకునే అభిరుచిగల అభ్యాసకుల్ని ఆహ్వానిస్తోంది. మా వ్యవస్థ చదువును మించి ఇంకా అదనపు అంశాలను అందిస్తుంది- ఇది సృజనాత్మకతను, విశ్లేషణాత్మకంగా ఆలోచించడం, సమగ్రమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. విద్యార్థులు ఆలోచనాత్మకంగా మారడానికి సాధికారత కల్పించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నాయకులుగా తయారు చేయడానికి మేము కట్టుబడ్డాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..