Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదో తరగతి ఉత్తీర్ణత : 32 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertiesment
railway job

ఠాగూర్

, గురువారం, 23 జనవరి 2025 (10:41 IST)
భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో 32 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి, ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత లేదా ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
అయితే, జనవరి 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే, నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్/ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీల కింద అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
 
పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత లేదా ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు. సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ (ఎస్ అండ్ టీ), మెకానికల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ తదితర విభాగాల్లో అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ), అసిస్టెంట్ లోకోషెడ్ (డీజిల్/ఎలక్ట్రికల్) పాయింట్స్‌మెన్, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, ట్రాక్ మెయింటెయినర్ తదితర పోస్టులు ఉన్నాయి.
 
ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి నెలకు రూ.18 వేలు చొప్పున ఇస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష. 90 నిమిషాల పాటు జరిగే ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానం రాస్తే 1/3 మార్కుల కోత విధిస్తారు.
 
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500, దివ్యాంగులు/మహిళలు, ట్రాన్స్ జెండర్లు/ఎక్స్ సర్వీస్మెన్/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ వర్గాలు/ ఈబీసీలు రూ.250 చొప్పున చెల్లించాలి. పరీక్షకు హాజరయ్యాక జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.400, మిగతా వారికి రూ.250 రిఫండ్ చేస్తారు.
 
దరఖాస్తుల్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 రాత్రి 11.59 గంటల వరకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ.250 (నాన్ రిఫండబుల్ చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 6 తర్వాత దరఖాస్తుల్లో మార్పులకు ఎలాంటి అవకాశం ఉండదు. 
 
దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్ లైన్ నంబర్లు 0172-565-3333, 9592001188కు కాల్ చేయవచ్చు. లేదా [email protected] ఈ- మెయిల్ ద్వారా సహాయం పొందొచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (పని దినాల్లో మాత్రమే) సంప్రదించాలి.
 
రైల్వే జోన్ల వారీగా భర్తీ చేసే ఉద్యోగాలు, వయో పరిమితిలో రిజర్వేషన్లు, రిక్రూట్మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న బుక్లెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...