రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 450 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్బీఐ ఈ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఆర్బీఐకి చెందిన వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తి చేసేందుకు డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కనీసం 50 శాతం మార్కులతో ఏదేనీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, హార్డ్ కాపీని రీజనల్ ఆఫీసుకు పంపించాలి. రూ.450 ఫీజు చెల్లించి, సంస్థ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి అప్లికేషన్లు సమర్పించాలి. డిసెంబర్ 02న ఆన్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.