Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ మార్గదర్శకాలను ధృవీకరించిన లీడ్ గ్రూప్ సర్వే

Education

ఐవీఆర్

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (14:52 IST)
భారతదేశంలోని పాఠశాల విద్య యొక్క ప్రస్తుత స్థితిని విశ్లేషించే 'ది పల్స్ ఆఫ్ స్కూల్ లీడర్స్ సర్వే' అనే కొత్త అధ్యయనాన్ని, భారతదేశంలోని ప్రముఖ స్కూల్ ఎడ్‌టెక్ లీడ్ గ్రూప్ విడుదల చేసింది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, తమ విద్యార్థులకు మల్టీమోడల్ విద్యను అందించే పాఠశాలలు పాఠ్యపుస్తకాల వంటి సాంప్రదాయ రూపాలను మాత్రమే ఉపయోగించే పాఠశాలల కంటే మిన్నగా ఫలితాలను సాధించాయి. 
 
దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 500కు పైగా ప్రైవేట్ పాఠశాలల రేటింగ్‌ల ఆధారంగా దేశవ్యాప్తంగా సర్వే జరిగింది. భావనాత్మక అంశాల పట్ల అవగాహన, విశ్వాసం, ఇంగ్లీష్ మాట్లాడటం, మొత్తంమీద విద్య యొక్క నాణ్యత- అనే నాలుగు క్లిష్టమైన విద్యార్థుల అభ్యాస ఫలితాలపై పాఠశాలలను తమను తాము రేట్ చేయమని అడిగారు.
 
చాలా పాఠశాలలు భావనాత్మక అంశాలపట్ల అవగాహన, మొత్తం నాణ్యతపై తమను తాము ఉన్నతంగా రేట్ చేసుకున్నప్పటికీ, విద్యార్థుల విశ్వాస స్థాయి, ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యాలలో మాత్రం అంతరాలు కనిపించాయి. అంతేకాకుండా, సరైన అభ్యాస మౌలిక సదుపాయాలు లేకపోవటం, విద్యార్థులలో తక్కువ అభ్యాస ఫలితాలు వంటివి ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాళ్లుగా కనిపిస్తున్నాయి.
 
లీడ్ వంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌లను ఉపయోగించే పాఠశాలల పనితీరులో, పాఠ్యపుస్తకాలు వంటి సాంప్రదాయ రూపాలపై ఆధారపడే పాఠశాలల పనితీరు పరంగా సర్వే స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతుంది. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ తమ లెసన్ ప్లాన్‌లలో నేర్చుకునే పాఠ్యపుస్తకాల ద్వారా, వీడియోల ద్వారా,  కార్యకలాపాల ద్వారా విభిన్న రీతులను మిళితం చేయడం గమనార్హం. ఈ వివిధ విధానాలను నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ 2023 సిఫార్సు చేసింది, ఇది అభ్యాసం, సాంప్రదాయ పాఠ్యపుస్తకాలకు మించి విస్తరించాలని నొక్కి చెబుతుంది.
 
కీలకమైన సబ్జెక్టులలో భావనాత్మక అంశాల పట్ల అవగాహన: ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న 93% పైగా పాఠశాలలు, తమ విద్యార్థులు గణితం, సైన్స్‌పై కాన్సెప్ట్‌ల పట్ల అవగాహనలో రాణించగలరని విశ్వసిస్తున్నారు, ఇతర పాఠశాలల్లో కేవలం 85% మాత్రమే ఉన్నారు.
 
ఆత్మ విశ్వాస స్థాయి: ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్‌ని ఉపయోగిస్తున్న 87% పాఠశాల లీడర్‌లు తమ విద్యార్థులలో మంచి కాన్ఫిడెన్స్ లెవల్స్‌ని నివేదించారు, అయితే 78% ఇతర పాఠశాలలు మాత్రమే ఈ విధంగా నివేదించాయి.
 
ఇంగ్లీషు ప్రావీణ్యం: ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ద్వారా మల్టీమోడల్ లెర్నింగ్‌ని అందించే 79% స్కూల్ లీడర్‌లు తమ విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడటం పట్ల సౌకర్యంగా ఉన్నారని నివేదించారు, ఇతర పాఠశాలల్లో ఇది 73% మందిగా ఉన్నారు.
 
నాణ్యమైన విద్య: చాలా పాఠశాలలు తమ విద్య నాణ్యతను బాగున్నాయని రేట్ చేసుకున్నాయి. అయితే, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్‌ని ఉపయోగించే మూడు పాఠశాలల్లో ఒకటి వాటి నాణ్యతను ఎక్కువగా రేట్ చేస్తే, నాలుగు ఇతర పాఠశాలల్లో ఒకటి మాత్రమే తమను తాము ఎక్కువగా రేట్ చేసుకున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న 94% పాఠశాల నాయకులు తమ విద్యార్థులలో మంచి విశ్వాస స్థాయిలను నివేదించారు, అయితే ఇతర పాఠశాలల్లో 87% మాత్రమే ఆవిధంగా నివేదించారు. అదనంగా, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ద్వారా మల్టీ-మోడల్ లెర్నింగ్‌ను అందించే 94% పాఠశాల నాయకులు తమ విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడటంలో సౌకర్యంగా ఉన్నట్లు నివేదించారు, ఇతర పాఠశాలల్లో 75% మంది మాత్రమే ఈ విధంగా ఉన్నారు.
 
లీడ్ గ్రూప్‌ నిర్వహించిన 'ది పల్స్ ఆఫ్ స్కూల్ లీడర్స్ సర్వే' ప్రకారం, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్‌ని ఉపయోగిస్తున్న ప్రిన్సిపాల్‌లు, పాఠశాల యజమానులు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, యాక్టివిటీ కిట్‌లు (48% స్కూల్ లీడర్‌లు), ఫోకస్డ్ టీచర్ ట్రైనింగ్‌ (33% పాఠశాల నాయకులు), కోడింగ్ (29% పాఠశాల నాయకులు) వాడకంతో మల్టీమోడల్ లెర్నింగ్‌కు పైన విద్యార్థుల పరివర్తనకు కారణమని పేర్కొన్నారు. ELGA (ఇంగ్లీషును నైపుణ్యంగా బోధించే లీడ్  యొక్క ప్రత్యేక కార్యక్రమం) వంటి పాఠ్యాంశాలలో గణనీయమైన ఆవిష్కరణలు చేస్తున్నారు.
 
పాఠశాలలు ఎదుర్కొంటున్న ఆకాంక్షలు, సవాళ్లను కూడా సర్వే పరిశీలించింది. పాఠశాలల యొక్క అత్యున్నత ఆకాంక్షలలో అకడమిక్ ఎక్సలెన్స్‌ పరంగా ప్రసిద్ధి చెందడం ఉంటే, రెండవ అత్యధిక ఆకాంక్షగా సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా సూచిస్తుంది. పాఠశాలలు ఎదుర్కొంటున్న మొదటి రెండు సవాళ్లులో, తగినంత ఆర్థిక వనరులు లేకపోవడం, విద్యార్థుల తక్కువ అభ్యాస నైపుణ్యాలు నిలుస్తున్నాయి. ప్రజాదరణ పొందిన అవగాహనకు విరుద్ధంగా, చాలా ప్రైవేట్ పాఠశాలలు తక్కువ, మధ్య ఆదాయ కుటుంబాలకు అందుబాటులోనే ఉంటున్నాయి.
 
ఈ సర్వేపై లీడ్ గ్రూప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమీత్ మెహతా స్పందిస్తూ, “పాఠశాలలు మన భవిష్యత్తుకు కీలకం. వారి ఆకాంక్షలు, వారి సవాళ్లు, ఏమి పని చేస్తున్నాయి, ఏమి మార్చాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. మేము మల్టి -మోడల్ లెర్నింగ్, ఉపాధ్యాయులను శక్తివంతం చేయడానికి సాంకేతికతను ఉపయోగించడాన్ని విశ్వసిస్తున్నాము. ఈ సర్వే ఫలితాలు మా నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి" అని అన్నారు.
మెహతా మరింతగా చెబుతూ, “దేశంలోని ప్రతి బిడ్డకు ప్రపంచ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం, 21వ శతాబ్దంలో వారు రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని వారికి అందించడం చేయనున్నాము. గత నెలలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జాతీయ విద్యా విధానం 2020, భారతదేశం అందరికీ నాణ్యమైన విద్యను అందించడం, విద్యాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించాలనే దాని దృక్పథాన్ని గ్రహించేలా ఒక బలమైన కార్యాచరణను అందిస్తుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోల్‌కతా రేప్ కేస్: ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో బుధవారం అర్ధరాత్రి ఏం జరిగింది?