Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ISRO: విద్యార్థుల కోసం ఇస్రోలో వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు.. దరఖాస్తులకు ఆహ్వానం

Advertiesment
ISRO

సెల్వి

, శనివారం, 21 ఫిబ్రవరి 2026 (16:34 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం విద్యార్థుల కోసం వివిధ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులను మార్చి 16, 2026 తేదీ వరకు స్వీకరిస్తారు. ఇంటర్న్‌షిప్ వ్యవధి కనిష్టంగా 21 రోజులు, గరిష్టంగా 45 రోజుల వరకు ఉంటుంది. ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు ఎటువంటి స్టైఫండ్, వేతనం లేదా ఆర్థిక సహాయం అందించబడవు. 
 
కానీ అంతరిక్ష శాఖ (DoS)కి సంబంధించిన సైన్స్, టెక్నాలజీ రంగాలలో అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ (బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ, ఎంటెక్, బీఎస్, ఎంఎస్ అండ్ పీహెచ్‌డీ) చదువుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
అలాగే విద్యార్థులు తమ సెమిస్టర్‌ పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా 10 పాయింట్ల స్కేల్‌పై 6.32 సీజీపీఏ సాధించి ఉండాలి. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు వీఎస్ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అకౌంట్‌ క్రియేట్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gold and Silver prices: బంగారం ధరలు రూ.1.60 లక్షల మార్కును తాకే ఛాన్స్