Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రియా విశ్వవిద్యాలయంలో ఐఎఫ్ఎంఆర్ జిఎస్‪బి, ఎంబిఎ ప్రొగ్రామ్ 2023 కోసం అడ్మిషన్లు

Krea
, శనివారం, 19 నవంబరు 2022 (23:00 IST)
ఆసియాలో మొట్టమొదటి, ఫైనాన్స్ శిక్షణ, పరిశోధనా సంస్థగా 50 ఏళ్ళకు పైబడి బలమైన వారసత్వం గలిగిన ఐఎఫ్ఎంఆర్, ప్రపంచవ్యాప్తంగా 25 కు పైగా దేశాల్లో 500 లకు పైగా సంస్థలకు చెందిన 50,000 మందికిపైగా వృత్తినిపుణులకి శిక్షణ ఇచ్చిన ఘన అనుభవాన్ని ఐఎఫ్ఎంఆర్ జిఎస్‪బి ముందుకు తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్స్, ఆర్థికశాస్త్ర రంగాల్లో ప్రముఖుల సారథ్యంతో నడుస్తున్న క్రియా విశ్వవిద్యాలయం తాలూకు తాజా, నవీన ఆలోచనలు, క్రియాశీలతను ఇందుకు జోడిస్తోంది.


భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ వారి నేషనల్ ఇనిస్టిట్యూషనల్ రాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ప్రకారం భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 50 బి-స్కూల్స్ లో ఐఎఫ్ఎంఆర్ జిఎస్‪బి కూడా స్థానం పొందింది, అలాగే, ఎస్ఎక్యుఎస్ (సౌత్ ఏషియన్ క్వాలిటీ అస్యూరెన్స్ సిస్టం) అధీకృత గుర్తింపు పొందింది. యుజిసి నిబంధనలని అనుసరించి ఇది నడుస్తుంది, అలాగే సిఎఫ్ఎ ఇనిస్టిట్యూట్ యూనివర్శిటీ అఫిలియేషన్ ప్రొగ్రామ్ లో భాగం కూడా.
 
ఈ రెండేళ్ళ రెసిడెన్షియల్ ఎంబిఎ కార్యక్రమం డాటా సైన్స్, ఫైనాన్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రాటజీ విభాగాల్లో కోర్సులు అందుబాటులోకి తెస్తోంది. ఘన విద్యావిషయిక చరిత్ర వున్నవారు లేదా కార్పొరేట్ రంగంలో పరిశ్రమ సారథులు సభ్యులుగావున్న బోధనా సిబ్బందితో బోధన సాగుతుంది. క్రియా విశ్వవిద్యాలయంలో ఐఎఫ్ఎంఆర్ జిఎస్‪బి పాఠ్యాంశాలు, సృజనాత్మక, పదునైన ఆలోచన, అత్యాధునిక పరిశోధనలతో కూడిన వ్యాపార ఆచరణలతో వృత్తినిపుణులని తీర్చిదిద్దుతుంది. ఐఎఫ్ఎంఆర్ జిఎస్‪బి ఎంబిఎ ప్రొగ్రామే  కాకుండా, ప్రపంచవ్యాప్తంగా  వున్న కార్పొరేట్ సంస్థలకు చెందిన ఎగ్జిక్యుటివ్ లకి అనువైన పిహెచ్‪డి, ఎగ్జిక్యుటివ్ ఎంబిఎ లనికూడా అందిస్తోంది. 
 
2021-22లో విద్యార్థులు 100% ప్లేస్మెంట్స్ సాధించిన అద్భుతమైన చరిత్రసాధించిన ఐఎఫ్ఎంఆర్ జిఎస్‪బి, 4 ప్రధాన సంస్థ (డెలాయిట్టె, ఎర్నెస్ట్ & యంగ్ (ఇవై), కెపిఎంజి, ప్రైస్‪వాటర్హవుస్ కూపర్స్)లతో సహా వివిధ విభాగాల్లో కన్సల్టింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రధాన సంస్థల్లో హామీపడదగిన, భవిష్యత్ దాయకమైన పాత్రలకి అవకాశం కల్పిస్తోంది. వ్యాపారవేత్తలు, అగ్రస్థాయి సిఎక్స్ఒలు, ప్రముఖ అంతర్జాతీయ విద్యావేత్తలు, ప్రభావశీల పరిశోధకులతోకూడిన 5000ల మందికిపైగా ప్రపంచవ్యాప్త అలుమిని నెట్వర్క్ కలిగిన వుండడం సంస్థకి గర్వకారణం, వీరు, వివిధ ఈవెంట్లు, సెషన్ల ద్వారా ప్రస్తుత విద్యార్థులతో నెట్వర్క్ అయి, వారిని మెంటర్ కూడా చేస్తారు.
 
ఈ ఎంబిఎ కార్యక్రమం గురించి ఐఎఫ్ఎంఆర్-జిఎస్‪బి, డీన్ లక్ష్మి కుమార్ మాట్లాడుతూ, "నిరంతరం పరిణామం చెందుతున్న వ్యాపార రంగంలో, "భంగపాటు అనేది ప్రతిరోజూ వినిపించే పదం. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల వల్ల నిరంతరం మనకి నిపుణులైన, అనువుగా మారగలిగిన, అనుగుణ్యమైన అదే సమయంలో బాధ్యతాయుతమైన, నైతికమైన, హుషారైన నాయకులు కావాల్సివుంటోంది. అంతర్మిళిత పరిస్థితులద్వారా సవాళ్ళని ఎదుర్కోవడం, భూమి, ప్రజలు, లాభాల మధ్య అంతర్ సంబంధాలని  అర్థంచేసుకుంటూ సమస్యలని పరిష్కరించగలిగేలా తరవాతి తరాన్ని తీర్చిదిద్దాలని మేం ఆశిస్తున్నాం. గతిశీలకంగా, సందర్భశుద్ధితో వుండే మా పాఠ్యాంశాలు వ్యాపార మూల కార్యకలాపాలు కమ్యూనికేషన్, డిజైన్ ఆలోచనలు, నైతికవిషయాలతో కలిసి నవీనమైన ఇంటర్ డిసిప్లినరీ కోర్సులతో  వుంటాయి. మా జ్ఞానదాయకమైన పాఠాలు పరిశోధన, సమకాలిక కేస్ స్టడీస్ ఆధారంగా వుంటాయి. వీటిని అద్భుతమైన బోధనాసిబ్బంది వివరిస్తారు" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్స్‌ ఫార్మ్‌తో డెయిరీ ఫార్మింగ్‌ను ఆస్వాదించిన చిన్నారులు