నేడు ఐసీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలుక ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. మొదటి, రెండు సెమిస్టర్ల మార్కులకు తుది స్కోరులో సమాన వెయిటేజి ఇచ్చినట్టు ఐసీఎస్ఈ బోర్డు కార్యదర్శి గెర్రి ఆరథూన్ వెల్లడించారు.
తుది ఫలితాల గణనలో ప్రతి సబ్జెక్టుకు ప్రాజెక్టు (అంతర్గత అంచనా) మార్కులు కలిపినట్లు వెల్లడించారు. సెమిస్టర్లకు హాజరుకాని విద్యార్థులను గైర్హాజరుగా పేర్కొంటూ వారి ఫలితాలు ప్రకటించబోమన్నారు.
ఫలితాలు ఐసీఎస్‌ఈ పోర్టల్ కెరీర్స్లో అందుబాటులో ఉంటాయి. బోర్డు చరిత్రలో మొదటిసారిగా ఒకే విద్యా సంవత్సరం సీఐఎస్‌సీఈ రెండు పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు.