చెన్నై అమృత హోటల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, అనేక మంది విద్యార్థులు విదేశీ విద్యను సులభంగా అభ్యసించేలా ప్రోత్సహిస్తోందని యూనివర్శిటీ ఆఫ్ మలేషియా వైస్ ఛాన్సలర్ అండ్ ఛైర్మన్ అన్వర్ అలీ అన్నారు. చెన్నై అమృత హోటల్ మేనేజ్‌మెంట్ మొదటి స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని పలువురు విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్‌మెంట్ విద్యను చెన్నై అమృత అందించడమే కాకుండా, ఇక్కడ కోర్సునూ ప్రిత చేసిన విద్యార్థులకు ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటల్స్‌లలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అలాగే ఉన్నత విద్యాభ్యాసాన్ని విదేశాల్లో కొనసాగించదలచుకున్న వారిని ప్రోత్సహిస్తోందన్నారు.
అనంతరం చెన్నై అమృత ఛైర్మన్ ఆర్ భూమినాథన్ మాట్లాడుతూ నాణ్యవంతమైన, ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు తమ సంస్థ కట్టుబడివుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ఆఫ్ మలేషియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాన్సూర్ బిన్ ఫడ్జిల్ తదితరులు పాల్గొన్నారు.