Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుకెలో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి వన్-స్టాప్ వేదిక

యుకెలో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి వన్-స్టాప్ వేదిక
, శుక్రవారం, 26 నవంబరు 2021 (23:06 IST)
యు.కెకు చెందిన విద్యావకాశాలు, సాంస్కృతిక సంబంధాల అంతర్జాతీయ సంస్థ అయిన బ్రిటిష్ కౌన్సిల్, తమ ‘స్టడీ యు.కె వర్చువల్ ఫెయిర్’ యొక్క నాల్గవ సంచికను 2021 డిసెంబర్ 4, శనివారం రోజున ఏర్పాటు చేస్తోంది. హాజరయ్యే వారు యు.కెలోని విద్యావకాశాల విషయంలో విశ్వవిద్యాలయానికి చెందిన అనేక మంది ప్రతినిధులతో మాట్లాడటానికి ఇంకా సూచనలను పొందడానికి, ఈ ఫెయిర్ ఒక వన్ స్టాప్ వేదిక అవుతుంది. ఇక్కడ కోర్సులు, విశ్వవిద్యాలయాలు, స్కాలర్‌షిప్ అవకాశాలతో పాటు దరఖాస్తు ప్రక్రియ ఇంకా అర్హతల గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఫెయిర్‌లో యు.కెలో విద్యార్థి జీవనం, ఆవాసం ఇంకా ఉద్యోగావకాశాల గురించి కూడా తెలుసుకోవచ్చు.

 
ఈ వర్చువల్ ఫెయిర్ సమయంలో, ఔత్సాహికులైన విద్యార్థులు 42 యు.కె విశ్వవిద్యాలయాలు, ఇంకా ప్రతిష్ఠాత్మకమైన 12 రస్సెల్ గ్రూప్ వ్యవస్థాపనలకు చెందిన ప్రతినిధులను సంప్రదించగలరు. విద్యార్థి వీసాను పొందడానికి ఉన్న ప్రస్తుత ప్రక్రియలోని సందేహాలను నివారించడానికి, హాజరయ్యే వారి కోసం ఈ ఫెయిర్ యు.కె వీసాస్ అండ్ ఇమ్మిగ్రేషన్ (యు.కె.వి.ఐ) అధికారులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. వీటితో పాటుగా విద్యాభ్యాసం తరువాత ఉద్యోగావకాశాల గురించి అలాగే గ్రాడ్యుయేట్ రూట్ గురించి కూడా అధికారులు ఒక కాలాంశాన్ని నిర్వహిస్తారు, దీని ద్వారా యు.కె గ్రాడ్యుయేట్‌లు వారి విద్యాభ్యాసం తరువాత అత్యధికంగా రెండు సంవత్సరాల వరకు ఉద్యోగం లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు.

 
బ్రిటిష్ కౌన్సిల్ యొక్క దక్షిణ భారత డైరెక్టర్, జనక పుష్పనాథన్, మాట్లాడుతూ, “యువకులైన భారతీయులు తమ ఉన్నత విద్యను & ఉద్యోగ లక్ష్యాలను సాధించి తద్వారా ప్రపంచ ఆర్ధిక వేదికపై విజయవంతంగా నిలిచేలా చేయడానికి మేము చేపట్టిన సంకల్పంలో భాగమే ఈ స్టడీ య.కె వర్చువల్ ఫెయిర్‌లు. యు.కె  ఆశావాహులకు వీసాలు, కోర్సులు, విశ్వవిద్యాలయాలు, స్కాలర్‌షిప్‌లు, ఇంకా మరెన్నో విషయాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందేలా అత్యంత విశ్వసనీయమైన వర్గాలతో నిరంతరాయంగా మరియు నేరుగా సంపర్కాన్ని ఈ ఫెయిర్ కల్పిస్తుంది, అలాగే నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారికి సహకరిస్తుంది. రాబోయే ఫెయిర్‌కు సంబంధించి మేము అత్యద్భుతమైన స్పందనను పొందాము అలాగే హాజరయ్యే వారిని కలిసి వారితో యు.కె విద్యాభ్యాసానికి సంబంధించిన అన్ని వివరాలను పంచుకోవాలని ఎదురుచూస్తున్నాము,” అన్నారు.    

 
యు.కె హోమ్ కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం గత ఏడాది కంటే 13% పెరుగుదలను ప్రదర్శిస్తూ, ఈ ఏడాది మార్చ్ 2021 ముగింపు సమయానికి 56,000 పైచిలుకు టైర్ 4 స్టడీ వీసాలను జారీ చేసి, భారతీయులు అత్యధికంగా అపేక్షించే విదేశీ విద్యాకేంద్రాలలో ఒకటిగా యు.కె కొనసాగుతోంది. పైగా, భారతీయ విద్యార్థుల విషయంలో 96% వీసాల జారీ రేటు అన్నది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ. 

 
కార్యక్రమ వివరాలు
తేదీ: శనివారం, డిసెంబర్ 4, 2021
వేదిక: జూమ్ / ఎమ్.ఎస్ టీమ్స్
సమయం: మ. 1:30 నుండి సా. 6:30
హాజరు అవ్వాల్సిన వారు: విద్యార్థులు, తల్లిదండ్రులు, మార్గదర్శకులు, విదేశీ విద్య సలహాదారులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలులో చెలరేగిన మంటలు.. పెను ప్రమాదం తప్పింది...