Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్.. 21 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Advertiesment
Bank of India
, గురువారం, 10 డిశెంబరు 2020 (14:12 IST)
నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్యూరిటీ ఆఫీసర్‌, ఫైర్‌ ఆఫీసర్ విభాగాలకు సంబంధించిన పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం 21 పోస్టులకు గాను 20 పోస్టులు సెక్యూరిటీ ఆఫీసర్, 01 పోస్టు ఫైర్ ఆఫీసర్ విభాగానికి చెందిన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు ఈ నెల 21ని ఆఖరు తేదీ అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
 
* ముఖ్యంగా సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారై ఉండాలి. 
* ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో కనీసం ఐదేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. 
* నవంబర్ 1 నాటికి వయస్సు 25-40 ఏళ్లు ఉండాలి
* ఫైర్ ఆఫీసర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 
 
మొత్తం ఐదు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన అర్హతలు నిర్ణయించారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూసుకోవచ్చు.
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలు తెలపబడతాయి. రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

50లోపు.. 65 ఏళ్లు దాటిన మహిళలకు శబరిమల ప్రవేశం