Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుర్తింపు లేదంటూ బిట్స్ హైదరాబాద్‌కు యూజీసీ షాక్!

Advertiesment
UGC
బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌కు యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) గట్టి షాక్ ఇచ్చింది. అలాగే, హైదరాబాద్‌లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండింటితో పాటు.. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలకు గుర్తింపు లేదని తేల్చి చెప్పింది. అందువల్ల ఈ సెంటర్లను తక్షణం మూసివేయాలని సూచన చేసింది. 
 
ఈ పది విద్యా సంస్థలు యూజీపీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై యూజీసీ డిప్యూటీ సెక్రటరీ సునితా సివాచ్ గత నెల పదో తేదీన మొత్తం పది సంస్థలకు నోటీసులు పంపించారు. ఇందులో తీసుకున్న చర్యల నివేదిక (ఏటీఆర్)ను సమర్పించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu