ఎపిఎస్‌ఎస్‌డిసి రిక్రూట్‌మెంట్ డ్రైవ్... శనివారం ఉదయం గం. 9:30 ఇంటర్వ్యూలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఎస్‌డిసి) ఎఫ్ ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న విజయవాడ ఎనికెపాడులోని ఎస్.ఆర్.కె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధిక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఎస్‌డిసి) ఎఫ్ ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న విజయవాడ ఎనికెపాడులోని ఎస్.ఆర్.కె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9:30 గంటల నుంచే ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. ఎపిఎస్‌ఎస్‌డిసి నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు హాజరయ్యే అభ్యర్థులు engineering.apssdc.in/careers వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలకు 2016, 17,18లో బీటెక్ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ 60 శాతం మార్కులతో పాసైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకి బీటెక్ (ఈసీఈ, ఈఈఈ, ఈసిఎం, ఈఐ, సిఎస్ఈ, ఐటి, ఈసిఎం) డిప్లొమా, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌లో 55 నుంచి 65 శాతం మార్కులు, బిసిఎ కంప్యూటర్స్‌లో 60 శాతం మార్కులతో పాసైన పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
ఇక ఫ్రంట్ ఆఫీసు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 2016, 17, 18లో డిగ్రీ, బిటెక్, ఎంబిఎ 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులంతా హాజరు కావచ్చు. మరిన్ని వివరాల కోసం పి. విజయ్ కుమార్‌ను 9948206501 నంబర్లో సంప్రదించవచ్చని ఎపిఎస్‌ఎస్‌డిసి అధికారులు తెలిపారు.