Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో గ్రూపు-1 ఉద్యోగాల నోటిఫికేషన్ - దరఖాస్తుల గడువు పొడగింపు

Advertiesment
appsc

వరుణ్

, బుధవారం, 24 జనవరి 2024 (12:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు వీుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. గత నాలుగున్నరేళ్ళుగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ జారీ చేయని ప్రభుత్వం... ఇపుడు గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీంతో ఈ గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడగించింది. అయితే, ఇకపై మరోమారు పొడగించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీ పీసీఎస్సీ) స్పష్టం చేసింది. 
 
జనవరి 28వ తేదీ అర్థరాత్రి వరకు ఈ పోస్టులకు ఆశావహ నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పొడగింపు నిర్ణయం తీసుకున్నామని, మరోమారు పొడగించేది లేదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టే మార్చి 17వ తేదీన గ్రూపు-1 ప్రిలిమ్స్ జరుగుతుందని తెలిపింది. గ్రూపు -1  ఉద్యోగాల దరఖాస్తు చేసుకునేందుకు https://psc.ap.gov.in అనే వెబ్‌‍సైట్‌ను సందర్శించాలని ఎపీపీఎస్సీ సూచించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ రెడ్డి అంటే నచ్చలేదా? ఐతే జగన్ అన్నగారు అంటా: వైఎస్ షర్మిల