Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకాష్ బైజూస్, ANTHE 2022 కింద 2 వేల మందికి స్కాలర్ షిప్పులు, ఉచితంగా నీట్‌- జెఈఈ శిక్షణ

Akash-Byjus
, గురువారం, 25 ఆగస్టు 2022 (17:16 IST)
భారతప్రభుత్వ ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని వేడుక చేయడంలో భాగంగా, టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి ఆకాష్‌ బైజూస్‌, సమ్మిళితత దిశగా భారీ కార్యక్రమం ప్రారంభించడంతో పాటుగా ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం ద్వారా ఉన్నత విద్య కోసం ప్రైవేట్‌ కోచింగ్‌ను అందించడం ద్వారా బాలికలకు సాధికారత అందించేందుకు భారీ కార్యక్రమం ప్రారంభించింది. దీనిద్వారా 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, మరీ ముఖ్యంగా బాలికలలో రెండు వేల మందికి  ఉచితంగా నీట్‌, జెఈఈ కోచింగ్‌ను అందించనుంది.
 
కీలకాంశాలు
ANTHE అనేది ఒక గంట పాటు జరిగే పరీక్ష. ఇది నవంబర్ 5-13, 2022 తేదీల మధ్య జరుగుతుంది.
ANTHE పరీక్ష ఆన్‌లైన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పరీక్ష తేదీలలో నిర్వహిస్తారు. అదే రీతిలో ఆఫ్‌లైన్ పరీక్షను నవంబర్ 6 నుంచి 13వ తేదీ వరకూ ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ మరియు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఆకాష్ బైజూస్‌కు ఉన్న 285 కేంద్రాలలో నిర్వహిస్తారు.
విద్యార్థులు తమకు అనుకూలమైన సమయం ఎంచుకుని పరీక్ష రాయవచ్చు.
ANTHE పరీక్షలో మొత్తం 90 మార్కులు ఉంటాయి. దీనిలో 35 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి విద్యార్థుల గ్రేడ్, స్ట్రీమ్స్‌కు అనుగుణంగా ఉంటాయి.
 
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా,  గుర్తించబడిన విద్యార్ధులంతా కూడా ఆకాష్‌ బైజూస్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పరీక్ష-2022 (ANTHE-2022)లో పాల్గొనాల్సి ఉంటుంది.  ఇనిస్టిట్యూట్‌ యొక్క ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షను నవంబర్‌ 5-13, 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్షలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 2వేల మంది విద్యార్ధులకు ఉచితంగా శిక్షణను ఆకాష్‌ బైజూస్‌ యొక్క ప్రతిష్టాత్మకమైన నీట్‌ మరియు ఐఐటీ-జెఈఈ కోచింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రత్యేక శ్రద్ధతో అందిస్తారు.
 
లబ్ధిదారులైన విద్యార్ధులను గుర్తించడంలో భాగంగా ఆకాష్‌ ఇప్పుడు ఎంపిక చేసిన ఎన్‌జీవోలతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఎన్‌జీఓలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులను నామినేట్‌ చేస్తారు. అది కూడా బాలికలను మరియు  సింగిల్‌ పేరెంట్‌ (తల్లులు మాత్రమే) కలిగిన వారిని సూచిస్తారు. ఆకాష్‌ బైజూస్‌‌కు భారతదేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉంది. దాదాపు 285కు పైగా కేంద్రాలు దేశంలో ఉన్నాయి. దేశంలో మరే ఇతర కోచింగ్‌ కేంద్రానికీ ఇన్ని కేంద్రాలు లేవు. ప్రతి కోచించ్‌ కేంద్రంలోనూ కనీసం 9 తరగతి గదులు సరాసరిన ఉన్నాయి.
 
అందరికీ విద్య కార్యక్రమం గురించి ఆకాష్‌ బైజూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ అకాష్‌ చౌదరి మాట్లాడుతూ, ‘‘పరిశ్రమలో ఎంతో కాలంగా ఉండటం చేత, మన దేశంలో వైద్య, ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించాలనే ఆసక్తి కలిగిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం చూస్తున్నాము. మా యువ విద్యార్థులంతా కూడా ఈ రెండు రంగాల పట్ల అమితాసక్తిని కనబరుస్తున్నారు మరియు స్వీయ అభివృద్ధి, సామాజిక  తోడ్పాటుకూ ఇవి అవకాశమందిస్తాయని భావిస్తున్నారు. అయితే, లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్‌ శిక్షణ కోసం తగిన విధంగా ఖర్చు పెట్టలేరు. భారీ మొత్తంలో ఈ ఖర్చు ఉండటం చేత వారు ప్రవేశ పరీక్షలలో తమ అవకాశాలను సైతం వదులుకుంటున్నారు. ఇక్కడ బాధాకరమైన అంశమేమిటంటే, ఈ అందుబాటు ధరలోని విద్య అనేది లింగ బేధం చూపడం. చాలా కుటుంబాలలో నిర్థిష్టమైన గ్రేడ్‌ దాటిన తరువాత బాలికల విద్యపై పెద్దగా ఖర్చు చేయడంలేదు. ఈ సందర్భాలన్నీ కూడా అణగారిన  వర్గాల విద్యార్ధులు మరియు సాధారణంగా  బాలికల మనో స్థైర్యంపై ప్రభావం చూపుతున్నాయి. అందరికీ విద్య కార్యక్రమం ద్వారా మేము మా వంతుగా ఈ విద్యార్థులకు అవకాశాలను విస్తరించడంతో పాటుగా కోచింగ్‌ సైతం అందించడానికి కృషి చేస్తున్నాము’’అని అన్నారు.
 
లబ్ధిదారులైన విద్యార్ధులకు తామందించే కోచింగ్‌ నాణ్యత పట్ల ఎలాంటి రాజీపడబోమని ఆయన వెల్లడిస్తూ,‘‘ఆకాష్‌ బైజూస్‌ యొక్క వేగవంతంగా విస్తరిస్తోన్న నెట్‌వర్క్‌ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా సమగ్రత మరియు మహిళా సాధికారిత పరంగా కూడా ఉత్తమమైనదిగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. ఈ కార్యక్రమంకు పేద కుటుంబాల నుంచి, ఒకే ఆడపిల్ల లేదా ఒంటరి మహిళలు లేదంటే ఇరువురి నుంచి అపూర్వ స్పందన లభించగలదనే విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు.
 
అందరికీ విద్య కార్యక్రమంలో భాగంగా అందించే స్కాలర్‌షిప్‌లను సాధారణ  ANTHE స్కాలర్‌షిప్‌లకు అదనంగా అందిస్తారు. గతంలో ANTHE 2022లో 13వ ఎడిషన్‌లో భాగంగా 100% స్కాలర్‌షిప్‌లను ప్రతిభావంతులైన విద్యార్ధులకు అందించింది. వీటితో పాటుగా ఐదుగురు విద్యార్థులకు ఉచితంగా నాసాను తమ తల్లిదండ్రులతో పాటుగా సందర్శించే అవకాశం కూడా లభించింది. అూఖీఏఉ ప్రారంభమైన నాటి నుంచి 33 లక్షల  మంది విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు.
 
ANTHE అనేది ఒక గంట పాటు జరిగే పరీక్ష. అూఖీఏఉ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పరీక్ష తేదీలలో నిర్వహిస్తారు. అదే రీతిలో ఆఫ్‌లైన్‌ పరీక్షను నవంబర్‌ 6 నుంచి 13వ తేదీ వరకూ ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ మరియు  సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఆకాష్‌ బైజూస్‌కు ఉన్న 285 కేంద్రాలలో  నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయం ఎంచుకుని పరీక్ష రాయవచ్చు.
 
ANTHE పరీక్షలో మొత్తం 90 మార్కులు ఉంటాయి. దీనిలో 35 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఇవి విద్యార్థుల గ్రేడ్‌, స్ట్రీమ్స్‌కు అనుగుణంగా ఉంటాయి.  9వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీలో పరీక్షలు ఉంటాయి. వైద్య విద్యనభ్యసించాలనుకునే పదవ తరగతి విద్యార్ధులకు  ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మెంటల్‌ ఎబిలిటీలో  పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌ చేయగోరు విద్యార్థులకు  ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీలో పరీక్షలు ఉంటాయి. 11మరియు 12 వ తరగతి చదువుతూ ఎవరైతే నీట్‌ లక్ష్యంగా పెట్టుకున్నారో వారికి పరీక్షలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ఉంటే, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్ చేయూత.. అర్హతలు ఇవే.. అకౌంట్లోకి రూ.18,750వేలు