త్రివిధ దళాల్లో చేరాలని ఆసక్తి కలిగిన వారికోసం సెప్టెంబర్ 14న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష-2008ను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
దేశ వ్యాప్తంగా 41 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకోసం ఇప్పటికే సంబంధింత అభ్యర్థులకు అనుమతి పత్రాలు పంపినప్పటికీ, వాటిని ఇంకా అందుకోని వారు తమ కమిషన్ను పని దినాల్లో స్వయంగా సంప్రదించడం కానీ. లేక తమ వెబ్ సైట్ ద్వారా కానీ తెలుసుకోవచ్చని వెల్లడించింది.