Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సృజనాత్మకతకు ఉపాధి : యానిమేషన్ రంగం

సృజనాత్మకతకు ఉపాధి : యానిమేషన్ రంగం

Munibabu

, బుధవారం, 6 ఆగస్టు 2008 (13:12 IST)
కాలం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సరైన ఉపాధిని ఎంచుకోవడం ఓ రకంగా అందరికీ సవాలు లాంటిదే. ఏ రంగంలో ప్రవేశించాలన్నా విపరీతమైన పోటీతోపాటు అపరిమితమైన విద్యార్హతలు, నైపుణ్యం అంటూ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

మరి ఇలాంటి తరుణంలో కొద్దిపాటి చదువుతో భవిష్యత్‌లో ఉపాధికి భరోసా నిచ్చేదిగా చెప్పాలంటే అది ఖచ్చితంగా యానిమేషన్ రంగమే. భారత్‌లో మెళ్లగా తన సత్తా చూపుతోన్న ఈ రంగం రానున్న రెండు మూడేళ్లలో వేగంగా విస్తరించే అవకాశముందన్నది నిపుణుల అంచనా.

కాస్త ఉహాశక్తి, చక్కగా బొమ్మలు గీసే సామర్థ్యం, చెప్పింది అర్థం చేసుకోవాడానికి కావల్సిన కనీస విద్యార్హత మాత్రం ఉంటే చాలు మీరు భవిష్యత్‌లో మంచి యానిమేషన్ రంగ నిపుణులుగా స్థిరపడవచ్చు. ప్రస్తుతం యానిమేషన్‌ రంగంలో తర్పీదు ఇచ్చేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

కొంతకాలం క్రితం వరకు కేవలం వినోదరంగంలో ఓ భాగంగా ఉన్న యానిమేషన్ రంగం ప్రస్తుతం స్వతంత్రత సంపాదించుకుని వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఇంట్లోనూ కన్పించే కార్టూన్ ఛానెల్స్ నుంచి ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల వరకు ఎక్కడ చూచినా యానిమేషన్ రంగానికి మంచి భవిష్యత్ ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.


నిపుణుల అంచనా ప్రకారం వచ్చే రోజుల్లో యానిమేషన్ రంగంలో నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడనుంది. అందుకే ఓ మోస్తరు చదువు, తక్కువ ఖర్చుతో భవిష్యత్‌లో మంచి ఉపాధిలో స్థిరపడాలనుకునేవారు యానిమేషన్ కోర్సులను నేర్చుకోవడం అన్ని రకాలుగా శ్రేయస్కరం.

కేవలం వినోదరంగంగానే కాకుండా ఇతర విభాగాల్లోనూ యానిమేషన్ అనేది ఓ భాగంగా మారిపోయింది. దీనివల్ల యానిమేషన్ రంగంలో చక్కని భవిష్యత్‌ ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. యానిమేషన్‌ రంగంలో డిప్లొమా చేయాలంటే ఇంటర్మీడియట్ కనీస విద్యార్హతగా ఉండాలి.

ఇంటర్ అర్హతతో యానిమేషన్‌లో డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ ముగించినవారికి యానిమేషన్‌లో పీజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. యానిమేషన్ రంగంలో మంచి అనుభవం, చక్కటి నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ ఇచ్చే సంస్థల్లో యానిమేషన్ కోర్సును అభ్యసించగల్గితే ఈ రంగంలో మంచి అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu