ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణంలో నెగ్గుకురావాలి అంటే... మనం చేస్తున్న పనిలో సృజనాత్మకత కొట్టొచ్చినట్లు కనిపించాలి. ఒక సంస్థలో పనిచేసే ఒకరో, ఇద్దరో సృజనాత్మకత కలిగి ఉంటే మాత్రం సరిపోదు. మొత్తం సంస్థ పనితీరే సృజనాత్మకంగా ఉండాలి. ఉండాలి అని అనుకుంటే సరిపోదు. పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ప్రతి ఒక్కరూ సృజనశీలురుగా ఉండేందుకు కృషి చేయాలి.పనిచేస్తున్న సంస్థలో సృజనాత్మక వాతావరణం వెల్లి విరియాలంటే పని సంస్కృతిలోనే స్పష్టమైన మార్పు గోచరించాలి. మానవ వనరుల నిపుణులు, నిర్వహణ అధికారులు ఇందుకు తగిన కృషి జరపాలి. పని సంస్కృతిలో మార్పు అనేది... కింద చెప్పేబోయే అంశాల ద్వారా కూడా రావచ్చు. అవేంటో కాస్త పరిశీలిద్దామా...?!యాంత్రికతా.. వద్దు.. వద్దు...!! |
|
రోజు పొడవునా ఏకబిగిన పని కోసమే అంటుకుపోతే ఆలోచనలు గడ్డ కట్టుకుపోతాయి. కాబట్టి మనస్సును యంత్రంలాగా కాకుండా, పారే సెలయేరులాగా ఉంచుకోవాలి. అప్పుడే కొత్తనీరు లాంటి ఆలోచనలు వచ్చి చేరుతాయి. ఎవరైనా చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకోవడం సహజం... |
|
|
"వెరీగుడ్... నైస్.. చాలా బాగా చేశావు" అన్న చిన్న ప్రశంస ఉద్యోగిలో ఉత్సాహం నింపే ఒక అద్భుతమైన మంత్రంగా పనిచేస్తుందంటే ఆశ్చర్యం లేదు. చేసిన పనిని గుర్తించే వాతావరణం ఉంటే, మరింత చక్కగా పనిచేయాలని ప్రతిఒక్కరూ తపిస్తారు. వీరి కృషికి చిన్న చిన్న బహుమతుల్లాంటివి ఇస్తే ఇంక చెప్పనక్కర లేదు.
పని వాతావరణంలో క్రమశిక్షణ పేరుతో నిశ్శబ్దంగా, ఎవరితోనూ మాట్లాడకుండా పనిచేసుకుంటూపోతే కొద్దిరోజులకు యాంత్రికతలో పడిపోక తప్పదు. సరదాగా మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉల్లాసంగా ఉండే వాతావరణంలో మనస్సు తాజాగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేసేపనిలో కూడా సృజనాత్మకత కనిపిస్తుంది.
ఇష్టమొచ్చినట్లు పనిచేసుకు పోవడమే స్వేచ్ఛ అనుకోనవసరం లేదు. సాధారణంగా చాలా సంస్థల్లో ఒక ఉద్యోగికి ఏదైనా ఆలోచన వస్తే... దాన్ని అమల్లో పెట్టేందుకు, టీం లీడర్, మేనేజర్, బాస్ దాకా తీసుకెళ్లేసరికి అతడికి ఉన్న ఆసక్తి చచ్చిపోతుంది. కాబట్టి, సాధ్యమైనంతగా దిగువస్థాయిదాకా నిర్ణయాధికార బదలాయింపు అనేది ఉంటే సృజనకు అవకాశం ఉంటుంది.
రోజు పొడవునా ఏకబిగిన పని కోసమే అంటుకుపోతే ఆలోచనలు గడ్డ కట్టుకుపోతాయి. కాబట్టి మనస్సును యంత్రంలాగా కాకుండా, పారే సెలయేరులాగా ఉంచుకోవాలి. అప్పుడే కొత్తనీరు లాంటి ఆలోచనలు వచ్చి చేరుతాయి.
ఒక కొత్త ఆలోచన కలిగినప్పుడు దాన్ని అమలుచేసే స్వేచ్ఛ లభించినప్పటికీ, సంస్థ నుండి వనరుల సమీకరణకు అదనపు సహకారం ఆ ఉద్యోగికి అవసరమవుతుంది. దీన్ని గమనించి యాజమాన్యం తగిన సహకారం అందిస్తే ఆ ఉద్యోగి నూతనోత్తేజంతో ఆ సంస్థకు సేవలందిస్తాడు.
ఎవరైనా చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకోవడం సహజం. అయితే అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తామని చెప్పలేము. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కోప్పడినా, నిరుత్సాహపర్చినా వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదు. పని సంస్కృతిలో ప్రయోగం ఒక భాగం కాబట్టి, ఎవరెన్ని రకాలుగా తక్కువ చేసి మాట్లాడినా పట్టువదలక శ్రమిస్తే విజయం మీదే అవుతుంది.